1
|
యెహోవా, నీ దేశం మీద దయ చూపించుము. యాకోబు ప్రజలు విదేశంలో ఖైదీలుగా ఉన్నారు. ఖైదీలను తిరిగి వారి దేశానికి తీసుకొని రమ్ము. |
2
|
యెహోవా, నీ ప్రజలను క్షమించుము! వారి పాపాలు తుడిచివేయుము. |
3
|
యెహోవా, కోపంగాను, ఆవేశంగా నుండవద్దు. |
4
|
మా దేవా, రక్షకా, మా మీద కోపగించటం మానివేసి, మమ్మల్ని మరల స్వీకరించు. |
5
|
నీవు మామీద శాశ్వతంగా కోపగిస్తావా? |
6
|
దయచేసి మమ్మల్ని మరల బ్రతికించుము! నీ ప్రజలను, సంతోషింపజేయుము. |
7
|
యెహోవా, నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నట్టుగా మాకు చూపించుము. మమ్మల్ని రక్షించుము. |
8
|
దేవుడు చప్పేది నేను వింటున్నాను. తన ప్రజలకు శాంతి కలుగుతుందని యెహోవా చెబతున్నాడు. ఆయన అనుచరులు వారి అవివేక జీవిత విధానాలకు తిరిగి వెళ్లకపోతే వారికి శాంతి ఉంటుంది. |
9
|
దేవుడు తన అనుచరులను త్వరలో రక్షిస్తాడు. మేము త్వరలోనే మా దేశంలో గౌరవంగా బతుకుతాము. |
10
|
దేవుని నిజమైన ప్రేమ ఆయన అనుచరులకు లభిస్తుంది. మంచితనం, శాంతి, ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొంటాయి. |
11
|
భూమి మీద మనుష్యులు దేవునికి నమ్మకంగా వుంటారు. పరలోకపు దేవుడు వారికి మేలు అనుగ్రహిస్తాడు. |
12
|
యెహోవా మనకు అనేకమైన మంచివాటిని ఇస్తాడు. భూమి అనేక మంచి పంటలను ఇస్తుంది. |
13
|
మంచితనం దేవునికి ముందర నడుస్తూ ఆయన కోసం, దారి సిద్ధం చేస్తుంది. |
Psalms 85:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...