1
|
దేవా, నీవు నా దేవుడవు. నాకు నీవు ఎంతగానో కావాలి. నా ఆత్మ, నా శరీరం నీళ్లులేక ఎండిపోయిన భూమిలా నీకొరకు దాహంగొని ఉన్నాయి. |
2
|
అవును, నీ ఆలయంలో నేను నిన్ను చూశాను. నీ బలము నీ మహిమలను నేను చూశాను. |
3
|
నీ ప్రేమ జీవం కన్నా గొప్పది. నా పెదాలు నిన్ను స్తుతిస్తున్నాయి. |
4
|
అవును, నా జీవితంలో నేను నిన్ను స్తుతిస్తాను. నీ వేరిట నేను నా చేతులెత్తి నీకు ప్రార్థిస్తాను. |
5
|
నేను శ్రేష్ఠమైన ఆహారం భుజించినట్లు నేను తృప్తిపొందుతాను. నా నోరు నిన్ను స్తుతిస్తుంది. |
6
|
నేను నా పడక మీద ఉండగా నిన్ను జ్ఞాపకం చేసుకొంటాను. రాత్రి ఝాములలో నిన్ను నేను జ్ఞాపకం చేసుకొంటాను. |
7
|
నీవు నిజంగా నాకు సహాయం చేశావు. నీవు నన్ను కాపాడినందుకు నేను సంతోషిస్తున్నాను. |
8
|
నా ఆత్మ నిన్ను హత్తుకొంటుంది. నీ కుడిచెయ్యి నన్నెత్తి పట్టుకొంటుంది. |
9
|
కొంతమంది మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. కాని వారు నాశనం చేయబడతారు. వారు వారి సమాధుల్లోకి దిగిపోతారు. |
10
|
ఖడ్గములతో వారు చంపబడతారు. అడవి కుక్కలు వారి మృత దేహాలను తింటాయి. |
11
|
అయితే రాజు తన దేవుని పట్ల సంతోషంగా ఉంటాడు. ఆయనకు విధేయులుగా ఉంటామని ప్రమాణంచేసిన మనుష్యులంతా ఆయనను స్తుతిస్తారు. ఎందుకంటే ఆ అబద్దికులందరినీ ఆయన ఓడించాడు. |
Psalms 63:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...