1
|
యెహోవా, దావీదు శ్రమపడిన విధానం జ్ఞాపకం చేసుకోమ్ము. |
2
|
కాని దావీదు యెహోవాకు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. ఇశ్రాయేలీయుల మహత్తర శక్తిగల దైవునికి దావీదు ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు.. |
3
|
దావీదు చెప్పాడు, “నేను నా యింట్లోకి వెళ్లను. నేను నా పడక మీద పండుకొనను, |
4
|
నేను నిద్రపోను, నేను నా కండ్లకు విశ్రాంతి నివ్వను, |
5
|
యెహోవా కోసం నేను ఒక మందిరాన్ని కనుగొనేంత వరకు ఆ పనుల్లో ఏదీ నేను చేయను! ఇశ్రాయేలీయుల మహ శక్తిగల దేవునికి నేనొక గృహం చూస్తాను!” |
6
|
ఎఫ్రాతాలో మేము దాని గూర్చి విన్నాం. ఒడంబడికపెట్టెను కిర్యత్యారీము దగ్గర మేము కనుగొన్నాము. |
7
|
మనం పవిత్ర గూడారానికి వెళ్దాం రండి. దేవుడు తన పాదాలు పెట్టుకొనే పీఠం దగ్గర మనము ఆయనను ఆరాధించుకొందాం. |
8
|
యెహోవా, నీ విశ్రమ స్థానం నుండి లెమ్ము. యెహోవా, నీవు నీ శక్తిగల ఒడంబడిక పెట్టెతో రమ్ము. |
9
|
యెహోవా, నీ యాజకులు నీతిని వస్త్రాలుగా ధరించనిమ్ము. నీ అనుచరులు చాలా సంతోషంగా ఉన్నారు. |
10
|
నీ సేవకుడైన దావీదు కోసం నీవు ఏర్పరచు కొన్న రాజును నిరాకరించవద్దు. |
11
|
యెహోవా దావీదుతో ఒక స్థిరప్రమాణం చేశాడు. యెహోవా దావీదుతో వెనుక తిరుగని ప్రమాణం చేశాడు. దావీదు వంశం నుండి రాజులు వస్తారని యెహోవా ప్రమాణం చేశాడు. |
12
|
“దావీదూ, నీ పిల్లలు నా ఒడంబడికకు, నేను వారికి నేర్పించే నా న్యాయ చట్టాలకు విధేయులయితే అప్పుడు నీ వర శంలో నుండి ఎవరో ఒకరు ఎల్లప్పుడూ రాజుగా ఉంటాడు” అని యోహోవా చెప్పాడు. |
13
|
యెహోవా, తన ఆలయ స్థానంగా ఉండుటకు సీయోనును ఎంచుకున్నాడు. తన నివాసస్థలంగా దాన్ని కోరు కొనియున్నాడు. |
14
|
యెహోవా చెప్పాడు, “శాశ్వతంగా ఇదే నా స్థలం. నేను ఉండే చోటుగా ఈ స్థలాన్ని ఎంచుకొంటున్నాను. |
15
|
సమృద్ధిగా ఆహారం యిచ్చి నేను ఈ పట్టణాన్ని ఆశీర్వదిస్తాను. ఇక్కడ పేదవాళ్లకు కూడా తినుటకు సమృద్ధిగా ఉంటుంది. |
16
|
యాజకులకు నేను రక్షణను ధరింపచేస్తాను. మరియు నా అనుచరులు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటారు. |
17
|
ఈ స్థలంలో, దావీదుకు ఒక కొమ్ములేచేలా చేస్తాను. నేను ఏర్పాటు చేసుకొన్న రాజుకు నేను ఒక దీపాన్ని సిద్ధం చేస్తాను. |
18
|
దావీదు శత్రువులను నేను అవమానంతో కప్పుతాను. కాని దావీదు కిరీటం దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. |
Psalms 132:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...