1
|
యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు గనుక ఆయనకు ఒక కొత్త కీర్తన పాడండి. |
2
|
ఆయన పవిత్ర కుడి హస్తం ఆయనకు విజయం తెచ్చింది. |
3
|
యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు. యెహోవా తన నీతిని వారికి చూపించాడు. |
4
|
ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు. రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు. |
5
|
భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి. |
6
|
స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి. స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము. |
7
|
బూరలు, కొమ్ములు ఊదండి. మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి. |
8
|
భూమి, సముద్రం, వాటిలో ఉన్న సమస్త జీవుల్లారా బిగ్గరగా పాడండి. |
9
|
నదులారా చప్పట్లు కొట్టండి. పర్వతములారా ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి. |
Psalms 98:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...