1
|
దేవా , ప్రజలు నా మీద దాడి చెస్తార గనుక నాకు దయ చూపించుము . రాత్రింబగళ్లు వారు నన్ను తరుముతూ పోరాడుతున్నారు . |
2
|
నా శత్రువులు రోజంతా నా మీద దాడి చేసారు. నాకు విరోధంగా పోరాడేవారు అనేకులు. |
3
|
నేను భయపడినప్పుడు నేను నిన్ను నమ్ము కొంటాను. |
4
|
నేను దేవుని నమ్ముకొన్నాను. కనుక నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం కోసం నేనాయనను స్తుతిస్తాను. |
5
|
నా శత్రువులు ఎల్లప్పుడూ నా మాటలు మెలితిప్పుతున్నారు. వారు ఎల్లప్పుడూ నాకు విరోధంగా చెడు పథకాలు వేస్తున్నారు. |
6
|
వారంతా కలసి దాక్కొని నా ప్రతీ కదలికనూ గమనిస్తున్నారు. నన్ను చంపుటకు ఏదో ఒక మార్గం కోసం ఎదురు చూస్తున్నారు. |
7
|
దేవా, వారిని తప్పించుకోనియ్యకుము, వారు చేసే చెడ్డ పనుల నిమిత్తం వారిని శిక్షించుము. |
8
|
నేను చాలా కలవరపడిపోయానని నీకు తెలుసు. నేను ఎంతగా ఏడ్చానో నీకు తెలుసు నిజంగా నీవు కన్నీళ్ల లెక్క వ్రాసే ఉంటావు. |
9
|
కనుక సహాయం కోసం నేను నీకు మెర పెట్టినప్పుడు నా శత్రువులు ఓడింపబడతారు. ఇది నాకు తెలుసు. ఏమంటే, దేవుడు నాతో ఉన్నాడు. |
10
|
దేవుడి వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను. యెహోవా నాకు చేసిన వాగ్దానం కోసం నేను ఆయనను స్తుతిస్తాను. |
11
|
నేను దేవుని నమ్ముకొన్నాను అందుచేత నేను భయపడను. మనుష్యులు నన్ను బాధించలేరు. |
12
|
దేవా, నేను నీతో ప్రత్యేక ప్రమాణం చేసాను. దాన్ని నెరవేరుస్తాను. నా కృతజ్ఞతార్పణ నేను నీకు యిస్తాను. |
13
|
[This verse may not be a part of this translation] |
Psalms 56:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...