1
|
యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను. కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందును. |
2
|
నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు. నా మాట వినుము. నన్ను రక్షించుము. |
3
|
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము. నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము. నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు. |
4
|
నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము. |
5
|
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ. నేను నా యౌవ్వనకాలంనండి నిన్ను నమ్ముకొన్నాను. |
6
|
నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను. నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు. నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను. |
7
|
ఇతరులకు నేను మాదిరిగా ఉన్నాను. ఎందుకంటే నీవే నా బలానికి ఆధారం. |
8
|
నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతున్నాను. |
9
|
కనుక నేను ముసలివాడినని నన్ను తోసివేయకుము. నా బలము క్షీణిస్తూండగా నన్ను విడిచి పెట్టకుము. |
10
|
నా శత్రువులు నిజంగా నాకు విరోధంగా పథకాలు వేసారు. ఆ మనుష్యులు నిజంగా కలుసుకొని నన్ను చంపుటకు పథకం వేసారు. |
11
|
“దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు, వెళ్లి అతన్ని పట్టుకోండి. అతనికి ఎవరూ సహాయం చేయరు” అని నా శత్రువులు అంటున్నారు. |
12
|
దేవా, నన్ను విడిచిపెట్టకుము. దేవా, త్వరపడుము! వచ్చి నన్ను రక్షించుము. |
13
|
నా శత్రువులను ఓడించుము. వారిని పూర్తిగా నాశనం చేయుము. వారు నన్ను బాధించుటకు ప్రయత్నిస్తున్నారు. వారు సిగ్గు, అవమానం అనుభవిస్తారని నా నిరీక్షణ. |
14
|
అప్పుడు నేను నిన్నే ఎల్లప్పుడూ నమ్ముకొంటాను. నేను నిన్ను ఇంకా ఇంకా ఎక్కువగా స్తుతిస్తాను. |
15
|
నీవు ఎంత మంచివాడవో దానిని నేను ప్రజలకు చెబతాను. నీవు నన్ను రక్షించిన సమయాలను గూర్చి నేను ప్రజలతో చెబతాను. లెక్కించేందుకు అవి ఎన్నెన్నో సమయాలు. |
16
|
యేహోవా, నా ప్రభూ , ని గోప్పతనాన్ని గూర్చి నేను చెబతాను . నిన్ను గూర్చి నీ మంచితనం గూర్చి మాత్రమే నేను మాట్లాడుతాను. |
17
|
దేవా , నేను చిన్న వానిగా ఉన్నప్పటి నుండి నీవు నాకు నేర్పించావు. నీవు చేసే అద్భుత విషయాలను గూర్చి ఈనాటివరకు నేను చెబతూనే ఉన్నాను. |
18
|
దేవా, నేను తల నెరసిన వృద్ధుడుగా ఉన్నప్పుడు కూడా నన్ను విడిచిపెట్టవని నాకు తెలుసు. నీ శక్తి, గొప్పదనాలను గూర్చి ప్రతి కొత్త తరానికీ నేను చెబతాను. |
19
|
దేవా, నీ మంచితనం ఆకాశాల కంటే ఎంతో ఉన్నతమైనది. దేవా, నీ వంటి దేవుడు మరొకడు లేడు. నీవు ఆశ్చర్యకర కార్యాలు చేశావు. |
20
|
నన్ను నీవు అనేక కష్టాలను, ప్రయాసములను చూడనిచ్చావు. కాని వాటిలో ప్రతి ఒక్క దాని నుండి నీవు నన్ను రక్షించావు. మరియు బ్రతికించి ఉంచావు. భూమి లోతులనుండి కూడా నీవు నన్ను తిరిగి పైకి తీస్తావు. |
21
|
ఇదివరకటి కంటే గొప్ప కార్యాలు చేయుటకు నాకు సహాయం చేయుము. నన్ను ఆదరిస్తూనే ఉండుము. |
22
|
స్వరమండలంతో నేను నిన్ను స్తుతిస్తాను. నా దేవా, నీవు నమ్మదగిన వాడవని నేను పాడుతాను. ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి నా సితారాతో నేను పాటలు పాడుతాను. |
23
|
నీవు నా ఆత్మను రక్షించావు. నా ఆత్మ సంతోషంగా ఉంటుంది. నేను నా పెదవులతో స్తుతి కీర్తనలు పాడుతాను. |
24
|
అన్ని వేళలా నా నాలుక నీ మంచితనమును గూర్చి పాడుతుంది. నన్ను చంపాలని కోరే ప్రజలు ఓడించబడి అవమానం పొందుతారు. |
Psalms 71:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...