1
|
యెహోవా నా దేవా, నిన్ను నేను నమ్ముకొన్నాను. నన్ను తరుముతున్న మనుష్యుల బారినుండి నన్ను రక్షించుము. నన్ను తప్పించుము. |
2
|
నాకు నీవు సహాయం చేయకపోతే అప్పుడు నేను సింహంచే పట్టబడి చీల్చబడిన జంతువులాగ ఉంటాను. నేను ఈడ్చుకొని పోబడతాను. ఏ మనిషి నన్ను రక్షించజాలడు. |
3
|
యెహోవా నా దేవా, నేను తప్పు చేసిన దోషిని కాను. నేనేమీ తప్పు చేయలేదు. |
4
|
నా స్నేహితునికి నేనేమీ కీడు చేయలేదు. నా స్నేహితుని శత్రువులకు నేను సహాయం చేయలేదు. |
5
|
కానీ నేను పాపము కలిగియుండిన యెడల శత్రువు నన్ను తరుమనిమ్ము. నన్ను పట్టుకొననిమ్ము, నా జీవితాన్ని నేలమీద తొక్కనిమ్ము. మరియు నా ప్రాణాన్ని మట్టిలోనికి నెట్టివేయనిమ్ము. |
6
|
యెహోవా, లెమ్ము నీ కోపాన్ని చూపెట్టుము. నా శత్రువు కోపంగా ఉన్నాడు కనుక నిలిచివానికి విరోధంగా పోరాడుము. లేచి న్యాయంకోసం వాదించుము. |
7
|
జనాలను నీ చుట్టూ ప్రోగుచేసి, వారి మీద పైనుండి పరిపాలించుము. |
8
|
ప్రజలకు తీర్పు తీర్చుము యెహోవా, నాకు తీర్పు తీర్చుము. నేను సరిగ్గా ఉన్నట్టు రుజువు చేయుము. నేను నిర్దోషిని అని రుజువు చేయుము. |
9
|
చెడ్డవాళ్లను శిక్షించి మంచివాళ్లకు సహాయం చేయుము. దేవా, నీవు మంచివాడవు, మరియు ప్రజల హృదయపు లోతుల్లోనికి నీవు చూడగలవు. |
10
|
నిజాయితీ హృదయాలుగల వారికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక దేవుడు నన్ను కాపాడుతాడు. |
11
|
దేవుడు మంచి న్యాయమూర్తి, మరియు ఏ సమయంలోనైనా దేవుడు తన కోపాన్ని చూపిస్తాడు. |
12
|
దేవుడు ఒక నిర్ణయం చేస్తే ఆయన తన మనస్సు మార్చుకోడు. |
13
|
ప్రజలను శిక్షించే శక్తి దేవునికి ఉంది. |
14
|
కొంతమంది మనుష్యులు చెడ్డపనులు చేసేందుకే ఎల్లప్పుడూ ఆలోచిస్తుంటారు. అలాంటివారు రహస్య పథకాలు వేస్తూ, అబద్ధాలు చెబుతారు. |
15
|
వారు యితరులను ఉచ్చులో వేసి, హాని చేయాలని ప్రయత్నిస్తారు. అయితే వారి స్వంత ఉచ్చుల్లో వారే చిక్కుబడతారు. |
16
|
వారు పొందాల్సిన శిక్ష వారు పొందుతారు. ఇతరులయెడల వారు కృ-రంగా ప్రవర్తించారు. అయితే వారు దేనికి పాత్రులో దానిని పొందుతారు. |
17
|
యెహోవా మంచివాడు గనుక నేను ఆయనను స్తుతిస్తాను. మహోన్నతుడైన యెహోవా నామాన్ని నేను స్తుతిస్తాను. |
Psalms 7:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...