1
|
యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు. నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను. |
2
|
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను. నీవు నన్ను స్వస్థపరచావు. |
3
|
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు. నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ ఉండవలసిన పనిలేదు. |
4
|
దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి. ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి. |
5
|
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది కానీ ఆయన తన ప్రేమను చూపించాడు. నాకు “జీవం” ప్రసాదించాడు. రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను. మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను. |
6
|
ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు. నేను ఎన్నటికీ ఓడించబడను. |
7
|
యెహోవా, నీవు నామీద దయ చూపావు. బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు. కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు. మరి నేను చాలా భయపడిపోయాను. |
8
|
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను. నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను. |
9
|
“దేవా, నేను మరణించి సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం? ధూళి నిన్ను స్తుతిస్తుందా? అది నీ నమ్మకమును గూర్చి చెప్పుతుందా? |
10
|
యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము. యెహోవా, నాకు సహాయం చేయుము.” |
11
|
నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.. నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు. నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు. |
12
|
యెహోవా, నా దేవా నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను. ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను. |
Psalms 30:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...