1
|
నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు. ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము. |
2
|
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ వారు ఎన్నడూ జయించలేదు. |
3
|
నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు. నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి. |
4
|
అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు. |
5
|
సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు. వారు పోరాటం మానివేసి పారిపోయారు. |
6
|
ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలచిన గడ్డిలాంటి వాళ్లు. ఆ గడ్డి ఎదుగక ముందే చస్తుంది. |
7
|
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకద. ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు. |
8
|
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక అని చెప్పారు.” “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు. |
Psalms 129:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...