1
|
ఇశ్రాయేలు ఈజిప్టు విడిచిపెట్టాడు. యాకోబు (ఇశ్రాయేలు) ఆ విదేశాన్ని విడిచిపెట్టాడు. |
2
|
ఆ కాలంలో యూదా దేవుని ప్రత్యేక ప్రజలయ్యారు. ఇశ్రాయేలు ఆయన రాజ్యం ఆయింది. |
3
|
ఎర్ర సముద్రం యిది చూచి పారిపోయింది. యొర్దాను నది వెనుదిరిగి పరుగెత్తింది. |
4
|
పర్వతాలు పొట్టేళ్లలా నాట్యం చేశాయి. కొండలు గొర్రెపిల్లల్లా నాట్యం చేశాయి. |
5
|
ఎర్ర సముద్రమా, ఎందుకు పారిపోయావు? యొర్దాను నదీ, నీవెందుకు వెనుదిరిగి పరిగెత్తావు? |
6
|
పర్వతాల్లారా, మీరెందుకు పొట్టేళ్లలా నాట్యం చేశారు? కొండలూ మీరెందుకు గొర్రె పిల్లల్లా నాట్యం చేశారు? |
7
|
యాకోబు దేవుడైన యెహోవా యెదుట భూమి కంపించింది. |
8
|
బండ నుండి నీళ్లు ప్రవహించేలా చేసినవాడు యెహోవాయే. ఆ కఠిన శిల నుండి నీటి ఊట ప్రవహించునట్లు దేవుడే చేసాడు. |
Psalms 114:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...