1
|
దేవా, నా ప్రార్థనా గీతం వినుము. నా ప్రార్థన ఆలకించుము. |
2
|
నేను ఎక్కడ ఉన్నా ఎంత బలహీనంగా ఉన్నా, సహాయం కోసం నీకు మొరపెడతాను. ఎత్తయిన క్షేమస్థలానికి నన్ను మోసికొనిపొమ్ము. |
3
|
నీవే నా క్షేమ స్థానం. నా శత్రువుల నుండి నన్ను కాపాడే బలమైన గోపురం నీవే. |
4
|
నీ గుడారంలో నేను శాశ్వతంగా నివసిస్తాను. నీవు నన్ను ఎక్కడ కాపాడగలవో అక్కడ దాక్కుంటాను. |
5
|
దేవా, నేను నీకిస్తానని చేసిన ప్రమాణం నీవు విన్నావు. కాని నిన్ను ఆరాధించేవారికి ఉన్న సమస్తం నీవద్ద నుండే వస్తుంది. |
6
|
రాజుకు దీర్గాయుష్షు దయచేయుము. అతన్ని శాశ్వతంగా జీవించనిమ్ము. |
7
|
అతన్ని దేవుని ఎదుట శాశ్వతంగా జీవించనిమ్ము. నీ నిజమైన ప్రేమతో మరియు విశ్వాసంతో అతనిని కాపాడుము. |
8
|
నేను నీ నామాన్ని శాశ్వతంగా స్తుతిస్తాను. నేను ప్రమాణం చేసిన వాటిని ప్రతి రోజూ చేస్తాను. |
Psalms 61:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...