1
|
దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము. రాజకుమారుడు నీ మంచి తనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము. |
2
|
నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము. నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము. |
3
|
దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము. |
4
|
పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక. నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము. |
5
|
సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను. ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను. |
6
|
పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము. నేలమీద పడేజల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము. |
7
|
అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము. చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము. |
8
|
సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము. |
9
|
అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిల పడనిమ్ము. |
10
|
తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక. షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక. |
11
|
రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక. రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక. |
12
|
మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు. మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు. |
13
|
పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు. రాజు వారిని బతికించి ఉంచుతాడు. |
14
|
వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు. ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం. |
15
|
రాజు దీర్గాయుష్మంతుడగును గాక. షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక. రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి. ప్రతిరోజూ అతణ్ణి దీవించండి. |
16
|
పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక. కొండలు పంటలతో నిండిపోవునుగాక. పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక. పొలాలు గడ్డితో నిండి పోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక. |
17
|
రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక. సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక. అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక. మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక. |
18
|
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి. అలాంటి అద్భుతకార్యాలు చేయగల వాడు దేవుడు ఒక్కడే. |
19
|
ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి. ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక. ఆమేన్, ఆమేన్! |
20
|
యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం. మూడవ భాగం |
Psalms 72:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...