1
|
దేవా, నీవు మమ్మల్ని విడిచి పెట్టేశావు. నీవు మమ్మల్ని ఓడించావు. మా మీద నీవు కోపగించావు. దయచేసి మమ్ములను ఉద్దరించుము. |
2
|
భూమి కంపించి పగిలి తెరచుకొనేలా నీవు చేశావు. మా ప్రపంచం పగిలిపోతోంది. దయచేసి దాన్ని బాగు చేయుము. |
3
|
నీ ప్రజలకు నీవు చాలాకష్టాలు కలిగించావు. తగుబోతు మనుష్యుల్లా మేము తూలి పడిపోతున్నాము. |
4
|
నీకు భయపడే వారికి నీ సత్యమైన వాగ్దానాలను స్థిరపరచుటకు ఒక ధ్వజమునెత్తావు. |
5
|
నీ మహా శక్తిని ప్రయోగించి మమ్మల్ని రక్షించు, నా ప్రార్థనకు జవాబు యిచ్చి, నీవు ప్రేమించే ప్రజలను రక్షించుము. |
6
|
దేవుడు తన ఆలయంలో నుండి మాట్లాడుతున్నాడు. “నేను గెలుస్తాను, ఆ విజయం గూర్చి సంతోషిస్తాను. నా ప్రజలతో కలిసి ఈ దేశాన్ని నేను పంచుకొంటాను. షెకెము, సుక్కోతు లోయలను నేను విభజిస్తాను. |
7
|
గిలాదు, మనష్షేనాది. ఎఫ్రాయిము నా శిరస్త్రాణము. యూదా నా రాజదండము. |
8
|
మోయాబును నా పాదాలు కడుక్కొనే పళ్లెంగా నేను చేస్తాను. ఎదోము నా చెప్పులు మోసేబానిసగా ఉంటుంది. ఫిలిప్తీ ప్రజలను నేను ఓడిస్తాను.” |
9
|
బలమైన భద్రతగల పట్టణానికి నన్ను ఎవరు తీసుకొని వస్తారు? ఎదోముతో యుద్ధం చేయుటకు నన్ను ఎవరు నడిపిస్తారు? |
10
|
దేవా, వీటిని చేసేందుకు నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవు. కాని నీవు మమ్మల్ని విడిచిపెట్టేసావు. దేవుడు మాతోను, మా సైన్యాలతోను వెళ్లడు. |
11
|
దేవా, మా శత్రువులను ఓడించుటకు సహాయం చేయుము. మనుష్యులు మాకు సహాయం చేయలేరు. |
12
|
కాని దేవుని సహాయంతో మేము జయించగలం. దేవుడు మా శత్రువులను ఓడించగలడు. |
Psalms 60:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...