1
|
పేద ప్రజలకు సహాయం చేసే మనిషి అనేక ఆశీర్వాదాలు పొందుతాడు. కష్టాలు వచ్చినప్పుడు యెహోవా ఆ మనిషిని రక్షిస్తాడు. |
2
|
ఆ మనిషిని యెహోవా కాపాడి అతని ప్రాణాన్ని రక్షిస్తాడు. ఆ మనిషికి ఈ దేశంలో అనేక ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుడు అతని శత్రువుల మూలంగా అతన్ని నాశనం కానివ్వడు. |
3
|
ఆ మనిషి రోగిగా పడకలో ఉన్నప్పుడు యెహోవా అతనికి బలాన్ని ఇస్తాడు. ఆ మనిషి రోగిగా పడకలో ఉండవచ్చు, కానీ యెహోవా అతనిని బాగుచేస్తాడు. |
4
|
నేను చెప్పాను, “యెహోవా, నాకు దయ చూపించుము. నేను నీకు విరోధంగా పాపం చేసాను. కాని నన్ను క్షమించి నన్ను బాగుచేయుము.” |
5
|
నా శత్రువులు నన్ను గూర్చి చెడు సంగతులు పలుకుతున్నారు. “వీడెప్పుడు చచ్చి మరువబడుతాడు?” అని వారంటున్నారు. |
6
|
కొందరు మనుష్యులు వచ్చి నన్ను దర్శిస్తున్నారు. కాని వాళ్లు నిజంగా ఏమి తలుస్తున్నారో చెప్పరు. ఆ మనుష్యులు నన్ను గూర్చిన వార్తలు తెలుసుకొనేందుకు మాత్రమేవస్తారు, మరియు వారు వెళ్లి, వారి గాలి కబర్లను ప్రచారం చేస్తారు. |
7
|
నా శత్రువులు నన్ను గూర్చి చెడ్డ సంగతులను రహస్యంగా చెబతారు. వారు నాకు విరోధంగా చెడు సంగతులను తలపెడుతున్నారు. |
8
|
“ఇతడు ఏదో తప్పుచేసాడు, అందుచేత ఇతడురోగి అయ్యాడు. ఇతడు తన పడక మీద నుండి ఎన్నటికి తిరిగి లేవడు” అని వారు అంటారు. |
9
|
నా మంచి స్నేహితుడు నాతో భోజనం చేసాడు. నేను అతన్ని నమ్మాను. కానీ ఇప్పుడు నా మంచి స్నేహితుడు కూడా నాకు విరోధి అయ్యాడు. |
10
|
కనుక యెహోవా, దయతో నన్ను కరుణించి, బాగుపడనిమ్ము. అప్పుడు నేను వారికి తగిన విధంగా చేస్తాను. |
11
|
యెహోవా నా శత్రువులు నన్ను భాధించని ఎడల అప్పుడు నీవు నన్ను స్వీకరించావని నేను తెలుసుకొంటాను. |
12
|
నేను నిర్దోషినైయుండగా నాకు సహాయం చేసితివి. నీ సన్నిధానంలో నీవు నన్ను ఎల్లప్పుడూ నిలుచుండనిస్తావు. |
13
|
ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఎల్లప్పుడూ స్తుతించబడ్డాడు. మరియు ఎల్లప్పుడూ స్తుతించబడతాడు. ఆమేన్ ఆమేన్! |
Psalms 41:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...