1
|
పెద్ద మనిషి, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు? |
2
|
వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు. నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది. |
3
|
మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు. సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం. |
4
|
నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడతుంది. |
5
|
అందచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు. ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు. |
6
|
మంచి వాళ్లు ఇది చూచి, దేవునిని గౌరవిస్తారు. వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు, |
7
|
“దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి. ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.” |
8
|
అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను. నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను. |
9
|
దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను. నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను. |
Psalms 52:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...