1
|
నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము. నా సర్వ అంగములారా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి. |
2
|
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము. ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము. |
3
|
మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు. మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు. |
4
|
దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు. ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు. |
5
|
దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు. ఆయన మనలను పక్షిరాజు పిల్లవలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు. |
6
|
యెహోవా న్యాయం కలవాడు. ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు. |
7
|
దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు. తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు. |
8
|
యెహోవా జాలిగలవాడు, దయగలవాడు. దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు. |
9
|
యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు. యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు. |
10
|
మనం దేవునికి విరోధంగా పాపం చేశాం. కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు. |
11
|
భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా తన అనుచరుల ఎడల దేవుని ప్రేమ ఉన్నది. |
12
|
పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం తీసివేశాడు. |
13
|
తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు. అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు. |
14
|
మనల్ని గూర్చి దేవునికి అంతా తెలుసు. మనం మట్టిలో నుండి చేయబడ్డామని దేవునికి తెలుసు. |
15
|
మన జీవితాలు కొద్దికాలమని దేవునికి తెలుసు. మన జీవితాలు గడ్డిలాంటివని ఆయనకు తెలుసు. |
16
|
మనం ఒక చిన్న అడవి పువ్వులాంటి వాళ్లం అని దేవునికి తెలుసు. ఆ పువ్వు త్వరగా పెరుగుతుంది. ఆ తరువాత వేడిగాలి వీస్తుంది; పువ్వు వాడి పోతుంది. త్వరలోనే ఆ పువ్వు ఎక్కడ ఎగురుతుందో నీవు చూడలేకపోతావు. |
17
|
కాని యెహోవా ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. దేవుడు తన అనుచరులను శాశ్వతంగా ప్రేమిస్తాడు. దేవుడు వారి పిల్లలయెడల, వారి పిల్లల పిల్లలయెడల, ఎంతో మంచివాడుగా ఉంటాడు. |
18
|
దేవుని ఒడంబడికకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు. దేవుని ఆదేశాలకు విధేయులయ్యేవారికి ఆయన మంచివాడు. |
19
|
దేవుని సింహాసనం పరలోకంలో ఉంది. మరియు ఆయన సమస్తాన్నీ పరిపాలిస్తున్నాడు. |
20
|
దేవదూతలారా, యెహోవాను స్తుతించండి దేవదూతలారా, మీరే దేవుని ఆదేశాలకు విధేయులయ్యే శక్తిగల సైనికులు. మీరు దేవుని మాట విని ఆయన ఆదేశాలకు విధేయులవ్వండి. |
21
|
యెహోవా సర్వసైన్యములారా, ఆయనను స్తుతించండి. మీరు ఆయన సేవకులు, దేవుడు కోరేవాటిని మీరు చేస్తారు. |
22
|
అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు. ఆవన్నీ యెహోవాను స్తుతించాలి! నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము! |
Psalms 103:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...