1
|
యెరూషలేము కొండల మీద దేవుడు తన ఆలయం నిర్మించాడు. |
2
|
ఇశ్రాయేలులో ఏ ఇతర స్థలాల కంటె సీయోను ద్వారాలు యెహోవాకు ఎక్కువ ఇష్టం. |
3
|
దేవుని పట్టణమా, ప్రజలు నిన్ను గూర్చి ఆశ్చర్యకరమైన సంగతులు చెబతారు. |
4
|
దేవుడు తన ప్రజలందరిని గూర్చీ ఒక జాబితా ఉంచుతున్నాడు. దేవుని ప్రజలు కొందరు ఈజిప్టులోను బబలోనులోను జీవిస్తున్నారు. ఆయన ప్రజలు కొందరు ఫిలిష్తీయలో, తూరులో, చివరికి ఇతియోపియాలో జన్మించినట్లు ఆ జాబితా తెలియజేస్తుంది. |
5
|
సీయోను గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తినీ దేవుడు ఎరుగును. సర్వోన్నతుడవైన దేవుడు ఆ పట్టణాన్ని నిర్మించాడు. |
6
|
దేవుడు తన ప్రజలు అందరిని గూర్చి ఒక జాబితా ఉంచుతాడు. ఒక్కో వ్యక్తి ఎక్కడ జన్మించింది దేవునికి తెలుసు. |
7
|
దేవుని ప్రజలు ప్రత్యేక పండుగలు ఆచరించుటకు యెరూషలేము వెళ్తారు. దేవుని ప్రజలు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. “మంచివన్నీ యెరూషలేము నుండి వస్తాయి.” అని వారు అంటారు. |
Psalms 87:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...