1
|
దేవా, నా శత్రువుల నుండి నన్ను రక్షించుము నాతో పోరాడేందుకు నా మీదికి వచ్చే మనుష్యులను జయించేందుకు నాకు సహాయం చేయుము. |
2
|
కీడు చేసే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. ఆ నరహంతకుల నుండి నన్ను రక్షించుము. |
3
|
చూడు బలాఢ్యులు నా కోసం కనిపెట్టి ఉన్నారు. నన్ను చంపేందుకు వారు కనిపెట్టుకున్నారు. నేను పాపం చేసినందువలన లేక ఏదో నేరం చేసినందు వలన కాదు. |
4
|
వారు నన్ను తరుముతున్నారు. నేను మాత్రం ఏ తప్పు చేయలేదు. యెహోవా, వచ్చి నీ మట్టుకు నీవే చూడు! |
5
|
నీవు సర్వశక్తిమంతుడవైన దేవుడవు, ఇశ్రాయేలీయుల దేవుడవు. లేచి జనాంగములన్నిటినీ శిక్షించుము. ఆ దుర్మార్గపు ద్రోహులకు ఎలాంటి దయా చూపించకుము. |
6
|
ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణములోకి వస్తారు. వారు మొరిగే కుక్కల్లా పట్టణమంతా తిరుగుతారు. |
7
|
వారి బెదరింపులు, అవమానాలు వినుము. వారు అలాంటి క్రూరమైన సంగతులు చెబతారు. వాటిని వింటున్నది ఎవరో వారికి అనవసరం. |
8
|
యెహోవా, వారిని చూసి నవ్వుము. ఆ జనాలను గూర్చి ఎగతాళి చేయుము. |
9
|
దేవా, నీవే నా బలం, నేను నీకోసం కనిపెట్టుకొన్నాను. దేవా, నీవే పర్వతాలలో ఎత్తయిన నా క్షేమస్థానం. |
10
|
దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు. నా శత్రువులను జయించుటకు ఆయనే నాకు సహాయం చేస్తాడు. |
11
|
దేవా, వారిని ఊరకనే చంపివేయకు. లేదా నా ప్రజలు మరచిపోవచ్చును. నా ప్రభువా, నా సంరక్షకుడా, నీ బలంతో వారిని చెదరగొట్టి, వారిని ఓడించుము. |
12
|
ఆ దుర్మార్గులు శపించి ఆబద్ధాలు చెబతారు. వారు చెప్పిన విషయాలను బట్టి వారిని శిక్షించుము. వారి గర్వం వారిని పట్టుకొనేలా చేయుము. |
13
|
నీ కోపంతో వారిని నాశనం చేయుము. వారిని పూర్తిగా నాశనం చేయుము. అప్పుడు యాకోబు ప్రజలనూ, సర్వప్రపంచాన్నీ దేవుడు పాలిస్తున్నాడని మనుష్యులు తెలుసుకొంటారు. |
14
|
అప్పుడు ఆ దుర్మార్గులు సాయంకాలం పట్టణంలోకి వస్తే మొరిగే కుక్కల్లా పట్టణం అంతా తిరుగుతూ ఉంటే |
15
|
అప్పుడు వారు తినుటకు ఏమైనా దొరుకుతుందని వెదకుతూ పోతారు. వారికి ఆహారం దొరకదు. నిద్రించుటకంత స్థలం దొరకదు. |
16
|
మరి నేను నీకు స్తుతి గీతాలు పాడుతాను. ఉదయాలలో నీ ప్రేమయందు ఆనందిస్తాను. ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమ స్థానం, కష్టాలు వచ్చినప్పుడు నేను నీ దగ్గరకు పరుగెత్తి పోగలను. |
17
|
నేను నీకు నా స్తుతిగీతాలు పాడుతాను. ఎందుకంటే ఎత్తయిన పర్వతాలలో నీవే నా క్షేమస్థానం. నీవు నన్ను ప్రేమించే దేవుడవు. |
Psalms 59:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...