1
|
ప్రభూవా, శాశ్వతంగా నీవే మా నివాసం. |
2
|
పర్వతాలు, భూమి, ప్రపంచం చేయబడక ముందే నీవు దేవుడిగా ఉండినావు. దేవా, ఇదివరకు ఎల్లప్పుడూ నీవే దేవుడవు మరియు ఎప్పటికి నీవే దేవునిగా ఉంటావు. |
3
|
మనుష్యులను తిరిగి మట్టిగా మారుస్తావు. మనుష్య కుమారులారా. తిరిగి రండని నీవు చెప్పుతావు. |
4
|
నీ దృష్టిలో వేయి సంవత్సరాలు గడచిపోయిన ఒక రోజువలె ఉంటాయి. గత రాత్రిలా అవి ఉన్నాయి. |
5
|
నీవు మమ్మల్ని ఊడ్చివేస్తావు. మా జీవితం ఒక కలలా ఉంది. మర్నాడు ఉదయం మేము ఉండము. మేము గడ్డిలా ఉన్నాము. |
6
|
ఉదయం గడ్డి పెరుగుతుంది. సాయంత్రం అది ఎండిపోయి వుంటుంది. |
7
|
దేవా, నీకు కోపం వచ్చినప్పుడు మేము నాశనం అవుతాము. నీ కోపం మమ్మల్ని భయపెడుతుంది! |
8
|
మా పాపాలు అన్నింటిని గూర్చి నీకు తెలుసు. దేవా, మా రహస్య పాపాలలో ప్రతి ఒక్కటి నీవు చూస్తావు. |
9
|
నీ కోపం నా జీవితాన్ని అంతం చేయవచ్చు. మా సంవత్సరాలు నిట్టూర్పులా అంతమయి పోతాయి. |
10
|
మేము 70 సంవత్సరాలు జీవిస్తాము. బలంగా వుంటే 80 సంవత్సరాలు జీవిస్తాము. మా జీవితాలు కష్టతరమైన పనితోను బాధతోను నిండి ఉన్నాయి. అప్పుడు అకస్మాత్తుగా మా జీవితాలు అంతం అవుతాయి. మేము ఎగిరిపోతాము. |
11
|
దేవా, నీ కోపం యొక్క పూర్తి శక్తి ఏమిటో నిజంగా ఎవరికీ తెలియదు. కాని దేవా, నీ యెడల మాకున్న భయము, గౌరవం నీ కోపమంత గొప్పవి. |
12
|
మాకు జ్ఞానోదయం కలిగేలా మా జీవితాలు నిజంగా ఎంత కొద్దిపాటివో మాకు నేర్పించుము. |
13
|
యెహోవా, ఎల్లప్పుడూ మా దగ్గరకు తిరిగి రమ్ము. నీ సేవకులకు దయ చూపించుము. |
14
|
ప్రతి ఉదయం నీ ప్రేమతో మమ్మల్ని నింపుము. మేము సంతోషించి, మా జీవితాలు అనుభవించగలిగేలా చేయుము. |
15
|
మా జీవితాల్లో చాలా దుఃఖం, కష్టాలు నీవు కలిగించావు. ఇప్పుడు మమ్మల్ని సంతోషింపచేయుము. |
16
|
వారి కోసం నీవు చేయగల ఆశ్చర్య కార్యాలను నీ సేవకులను చూడనిమ్ము. వారి సంతానాన్ని నీ ప్రకాశమును చూడనిమ్ము. |
17
|
మా దేవా, మా ప్రభూ, మా యెడల దయచూపించుము. మేము చేసే ప్రతిదానిలో మాకు సఫలత అనుగ్రహించుము. |
Psalms 90:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...