1
|
దేవా, నీ నామం ద్వారా నన్ను రక్షించుము. నన్ను విడుదల చేయుటకు నీ శక్తి ఉపయోగించుము. |
2
|
దేవా నా ప్రార్థనను, నేను చెప్పే సంగతులను ఆలకించుము. |
3
|
పరదేశీయులు నాకు విరోధంగా తిరిగారు. బలాఢ్యులైన మనుష్యులు నన్ను చంపుటకు ప్రయత్నిస్తున్నారు. దేవా ఆ మనుష్యులు నిన్ను కనీసం ఆరాధించరు. |
4
|
చూడండి, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు. నా ప్రభువు నన్ను బలపరుస్తాడు. |
5
|
తమ స్వంత దుష్టత్వముతో నాపై గూఢచారత్వము చేసే జనులను దేవుడు శిక్షిస్తాడు. దేవా, నీవు నాకు నమ్మకస్తుడవై ఉండుటనుబట్టి ఆ జనులను నాశనం చేయుము. |
6
|
దేవా, నేను నీకు స్వేచ్ఛార్పణలు ఇస్తాను. యెహోవా, నేను నీకు వందనాలు చెల్లిస్తాను. ఎందుకంటే నీవు మంచివాడవు. |
7
|
నీవు నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించావు. మరియు నా శత్రువులు ఓడిపోవటం నేను చూసాను. |
Psalms 54:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...