1
|
దేవా, నీ నామమునుబట్టి నన్ను రక్షింపుము నీ పరాక్రమమునుబట్టి నాకు న్యాయము తీర్చుము. |
2
|
దేవా, నా ప్రార్థన ఆలకింపుము నా నోటి మాటలు చెవినిబెట్టుము. |
3
|
అన్యులు నా మీదికి లేచియున్నారు బలాఢ్యులు నా ప్రాణము తీయజూచుచున్నారు వారు తమయెదుట దేవుని ఉంచుకొన్నవారు కారు. (సెలా.) |
4
|
ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు |
5
|
నా శత్రువులు చేయు కీడు ఆయన వారిమీదికి రప్పించును నీ సత్యమునుబట్టి వారిని నశింపజేయుము సేచ్చార్పణలైన బలులను నేను నీకర్పించెదను. |
6
|
యెహోవా, నీ నామము ఉత్తమము నేను దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. |
7
|
ఆపదలన్నిటిలోనుండి ఆయన నన్ను విడిపించి యున్నాడు నా శత్రువుల గతిని చూచి నా కన్ను సంతోషించు చున్నది. |
Psalms 54:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...