1
|
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు. |
2
|
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను |
3
|
వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు |
4
|
యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు. |
5
|
ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు |
6
|
బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు. |
7
|
సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. |
Psalms 14:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...