1
|
యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి యున్నావు చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించియున్నావు. |
2
|
నీ ప్రజల దోషమును పరిహరించియున్నావు వారి పాపమంతయు కప్పివేసి యున్నావు (సెలా.) |
3
|
నీ ఉగ్రత అంతయు మానివేసియున్నావు నీ కోపాగ్నిని చల్లార్చుకొని యున్నావు |
4
|
మా రక్షణకర్తవగు దేవా, మావైపునకు తిరుగుము.మా మీదనున్న నీ కోపము చాలించుము. |
5
|
ఎల్లకాలము మామీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? |
6
|
నీ ప్రజలు నీయందు సంతోషించునట్లు నీవు మరల మమ్మును బ్రదికింపవా? |
7
|
యెహోవా, నీ కృప మాకు కనుపరచుము నీ రక్షణ మాకు దయచేయుము. |
8
|
దేవుడైన యెహోవా సెలవిచ్చుమాటను నేను చెవిని బెట్టెదను ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభ వచనము సెలవిచ్చును వారు మరల బుద్ధిహీనులు కాకుందురు గాక. |
9
|
మన దేశములో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడువారికి సమీపముగా నున్నది. |
10
|
కృపాసత్యములు కలిసికొనినవి నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దుపెట్టు కొనినవి. |
11
|
భూమిలోనుండి సత్యము మొలుచును ఆకాశములోనుండి నీతి పారజూచును. |
12
|
యెహోవా ఉత్తమమైనదాని ననుగ్రహించును మన భూమి దాని ఫలమునిచ్చును. |
13
|
నీతి ఆయనకు ముందు నడచును ఆయన అడుగుజాడలలో అది నడచును. |
Psalms 85:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...