1
|
దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్యకార్యములను వివరించుదురు. |
2
|
నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమునుబట్టి తీర్పు తీర్చుచున్నాను. |
3
|
భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును.(సెలా.) |
4
|
అహంకారులై యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. |
5
|
కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరుపట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. |
6
|
తూర్పునుండియైనను పడమటినుండియైనను అరణ్యమునుండియైనను హెచ్చుకలుగదు. |
7
|
దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును |
8
|
యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయుచున్నాడు భూమిమీదనున్న భక్తిహీనులందరు మడ్డితోకూడ దానిని పీల్చి మింగివేయవలెను. |
9
|
నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయు దును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. |
10
|
భక్తిహీనుల కొమ్ములనన్నిటిని నేను విరుగగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును. |
Psalms 75:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...