1
|
దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి. ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి. |
2
|
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి. మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి. |
3
|
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు. మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది. |
4
|
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది. ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది. |
5
|
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టును. లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు. |
6
|
లెబనోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి. షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. |
7
|
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది. |
8
|
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది. యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది. |
9
|
యెహోవా స్వరం లేడి భయపడేటట్టు చేస్తుంది. ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు. ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు. |
10
|
వరదలను యెహోవా అదుపు చేసాడు. మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు. |
11
|
యెహోవా తన ప్రజలను కాపాడును గాక,. యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక. |
Psalms 29:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...