1 | భూమీ, యెహోవాను గూర్చి పాడుము! |
---|
2 | నీవు యెహోవాను సేవిస్తూ సంతోషంగా ఉండు! ఆనంద గీతాలతో యెహోవా ఎదుటికి రమ్ము. |
---|
3 | యెహోవా దేవుడని తెలుసుకొనుము. ఆయనే మనలను సృజించాడు. మనం ఆయన ప్రజలము. మనము ఆయన గొర్రెలము. |
---|
4 | కృతజ్ఞతా కీర్తనలతో యెహోవా పట్టణంలోనికి రండి. స్తుతి కీర్తనలతో ఆయన ఆలయంలోనికి రండి. ఆయనను గౌరవించండి ఆయన నామాన్ని స్తుతించండి. |
---|
5 | యెహోవా మంచివాడు. ఆయన ప్రేమ నిరంతరం ఉంటుంది. ఆయన్ని శాశ్వతంగా నమ్ము కోవచ్చు. |
---|