1
|
రండి, మనం యెహోవాని స్తుతించుదాము. మన రక్షణా బండైన ప్రభువుకు సంతోషగానం చేద్దాము. |
2
|
యెహోవాకు మనం కృతజ్ఞతా కీర్తనలు పాడుదాము. సంతోష గీతాలు మనం ఆయనకు పాడుదాము. |
3
|
ఎందుకంటే ఆయన మహా గొప్ప దేవుడు గనుక. ఆయన యితర “దేవుళ్లందరినీ” పాలించే మహా రాజు. |
4
|
లోతైన గుహలు, ఎత్తయిన పర్వతాలు యెహోవాకు చెందుతాయి. |
5
|
మహా సముద్రమూ ఆయనదే ఆయనే దాన్ని సృష్టించాడు. దేవుడు తన స్వహస్తాలతో పొడినేలను చేశాడు. |
6
|
రండి, మనం సాగిలపడి ఆయనను ఆరాధించుదాము. మనలను సృష్టించిన దేవున్ని మనం స్తుతిద్దాము. |
7
|
ఆయన మన దేవుడు, మనం ఆయన ప్రజలము. మనం ఆయన స్వరం వింటే నేడు మనం ఆయన గొర్రెలము. |
8
|
దేవుడు చెబతున్నాడు, “మెరీబా దగ్గర మీరు ఉన్నట్టుగా అరణ్యంలో మస్సా దగ్గర మీరు ఉన్నట్టుగా మొండిగా ఉండకండి. |
9
|
మీ పూర్వీకులు నన్ను శోధించారు. వారు నన్ను పరీక్షించారు. కానీ అప్పుడు నేను ఏమి చేయగలిగానో వారు చూశారు. |
10
|
ఆ ప్రజలతో 40 సంవత్సరాలు నేను సహనంగా ఉన్నాను. వారు నమ్మకస్తులు కారని నాకు తెలుసు. ఆ ప్రజలు నా ఉపదేశాలు అనుసరించటానికి నిరాకరించారు. |
11
|
అందుచేత నాకు కోపం వచ్చి, వారు నా విశ్రాంతి దేశంలో ప్రవేశించరు అని ప్రమాణం చేశాను. |
Psalms 95:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...