1
|
దేవా, నా కష్టాలన్నిటి నుండీ నన్ను రక్షించుము. నా నోటి వరకు నీళ్లు లేచాయి. |
2
|
నిలబడి ఉండుటకు ఏదీ లేదు. నేను మునిగిపోతున్నాను. కింద బురదలోకి దిగజారిపోతున్నాను. లోతైనజలాల్లో నేనున్నాను. అలలు నా చుట్టూకొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను. |
3
|
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను. నా గొంతు నొప్పిగా ఉంది. నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు నేను నీ సహాయం కోసం కని పెట్టి చూశాను. |
4
|
నా తలపైగల వెంట్రుకల కంటే ఎక్కువ మంది శత్రువులు నాకున్నారు. ఏ కారణం లేకుండానే వారు నన్ను ద్వేషిస్తున్నారు. వారు నన్ను నాశనం చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నా శత్రువులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. వారు అబద్ధమాడి నేను వస్తువులు దొంగిలించానని చెప్పారు. ఆ తరువాత నేను దొంగిలించని వాటికి నా చేత బలవంతంగా డబ్బు కట్టించారు. |
5
|
దేవా, నేను ఏ తప్పు చేయలేదని నీకు తెలుసు. నా పాపము నీ నుండి దాచి పెట్టబడలేదు. |
6
|
నా దేవా, సర్వశక్తిమంతుడవైన యెహోవా, నా మూలంగా నీ అనుచరులను సిగ్గుపడనియ్యకుము. ఇశ్రాయేలీయుల దేవా, నా మూలంగా నీ ఆరాధకులను ఇబ్బంది పడనీయకుము. |
7
|
నా ముఖం సిగ్గుతో నిండి ఉంది. నీ కోసం ఈ సిగ్గును నేను భరిస్తాను. |
8
|
నా సోదరులు నన్ను పరాయి వానిలా చూస్తారు. నా తల్లి కుమారులు నన్నొక విదేశీయునిలా చూస్తారు. |
9
|
నీ ఆలయాన్ని గూర్చిన నా ఉత్సాహము నన్ను దహించుచున్నది. నిన్ను ఎగతాళి చేసే మనుష్యుల అవమానాలను నేను పొందుతున్నాను. |
10
|
నేను ఉపవాసం ఉండి ఏడుస్తున్నాను. అందు నిమిత్తం వారు నన్ను ఎగతాళి చేస్తున్నారు. |
11
|
నా విచారాన్ని చూపించేందుకు నేను మోటుబట్టలు ధరిస్తున్నాను. ప్రజలు నన్ను గూర్చి పరిహాసాలు చెప్పుకొంటున్నారు. |
12
|
బహిరంగ స్థలాల్లో వారు నన్ను గూర్చి మాట్లాడుకొంటున్నారు. తాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుతున్నారు. |
13
|
నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన. నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను. దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను. |
14
|
బురదలో నుండి నన్ను పైకిలాగుము. బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు. నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము. లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము. |
15
|
అలలు నన్ను ముంచివేయనీయకుము. లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము. సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము |
16
|
యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము. నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకోనుము. |
17
|
నీ సేవకునికి విముఖుడవు కావద్దు. నేను కష్టంలో ఉన్నాను. త్వరపడి నాకు సహాయం చేయుము. |
18
|
వచ్చి నా ఆత్మను రక్షించుము. నా శత్రువులనుండి నన్ను తప్పించుము. |
19
|
నా అవమానం నీకు తెలుసు. నా శత్రువులు నన్ను అవమాన పరిచారని నీకు తెలుసు. వారు నన్ను కించపరచటం నీవు చూసావు. |
20
|
సిగ్గు నన్ను కృంగదీసింది. అవమానం చేత నేను చావబోతున్నాను. సానుభూతి కోసం నేను ఎదురు చూశాను. కాని ఏమీ దొరకలేదు. ఎవరైనా నన్ను ఆదరిస్తారని నేను ఎదురుచూశాను. కాని ఎవరూ రాలేదు. |
21
|
వారు నాకు భోజనం కాదు విషం పెట్టారు. ద్రాక్షా రసానికి బదులుగా చిరకను వారు నాకు ఇచ్చారు. |
22
|
వారి బల్లల మీద భోజన పానాలు పుష్కలంగా ఉన్నాయి. విందులు జరుగుతుంటాయి. వారి భోజనాలే వారికి ఎక్కువ అగును గాక. |
23
|
వారి కన్నులకు చీకటి కలిగి చూడలేక పోదురు గాక! వారి నడుములు ఎడతెగకుండా వణుకునట్లు చేయుము. |
24
|
నీ కోపమును వారిపై కుమ్మరించుము. నీ భయంకర కోపమును వారు సహించనిమ్ము. |
25
|
వారి కుటుంబాలు, ఇండ్లు పూర్తిగా నాశనం చేయబడునుగాక. |
26
|
నీవు వారిని శిక్షించుము. వారు పారిపోతారు. అప్పుడుబాధను గూర్చి వారు మాట్లాడుకుంటారు. |
27
|
వారు చేసిన చెడ్డ పనులకు గాను వారిని శిక్షించుము. నీవు ఎంత మంచి వాడవుగా ఉండగలవో వారికి చూపించవద్దు. |
28
|
జీవ గ్రంథంలో నుండి వారి పేర్లు తుడిచివేయుము. మంచి మనుష్యుల పేర్లతో పాటు వారి పేర్లను గ్రంథంలో వ్రాయవద్దు. |
29
|
నేను విచారంగాను, బాధతోను ఉన్నాను. దేవా నన్ను లేవనెత్తుము. నన్ను రక్షించుము. |
30
|
దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను. కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను. |
31
|
ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము. ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది. |
32
|
పేద ప్రజలారా మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు. పేద ప్రజలారా ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు. |
33
|
నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు. యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు. |
34
|
ఆకాశమా, భూమీ, సముద్రమా, దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి. |
35
|
యెహోవా సీయోనును రక్షిస్తాడు. యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు. ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు. |
36
|
ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు. ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు. |
Psalms 69:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...