దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు. నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు. మాకు చాలా సంతోషంగా ఉంది! నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు. నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు. వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు. నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు. దేవా, నీవు కాలువలను నీళ్లతో నింపుతావు. పంటలు పండింపచేస్తావు. నీవు దీనిని ఇలా చేస్తావు.
దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు. భూములను నీవు నీళ్లతో నానబెడతావు. నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు. అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.