1
|
బబులోను నదుల దగ్గర మనం కూర్చొని సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం. |
2
|
దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లుకు మన సితారాలు తగిలించాము. |
3
|
బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు. సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు. సియోను గూర్చి పాటలు పాడుమని వారు మనకు చెప్పారు. |
4
|
కానీ విదేశంలో మనం యెహోవాకు కీర్తనలు పాడలేము! |
5
|
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండి పోవును గాక! |
6
|
యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచి పోతే నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకు పోవును గాక! నేను ఎన్నటికీ నిన్ను మరువనని వాగ్దానం చేస్తున్నాను. |
7
|
యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను! యెహోవా, యెరూషలేము పడిన రోజున ఎదోమీయులు ఏమిచేసారో జ్ఞాపకం చేసుకోనుము. దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు. |
8
|
బబులోనూ, నీవు నాశనం చేయబడతావు! నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించ బడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక! |
9
|
నీ చంటి బడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు. |
Psalms 137:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...