1
|
యెహోవా ఏలుతున్నాడు, భూమి సంతోషిస్తోంది. దూర దేశాలన్నీ సంతోషిస్తున్నాయి. |
2
|
దట్టమైన చీకటి మేఘాలు యెహోవాను ఆవరించాయి. నీతి న్యాయాలు ఆయన రాజ్యాన్ని బలపరుస్తాయి. |
3
|
యెహోవా ముందర అగ్నిబయలు వెళ్తూ ఆయన శత్రువులను నాశనం చేస్తుంది. |
4
|
ఆయన మెరుపు ఆకాశంలో తళుక్కుమంటుంది. ప్రజలు దాన్ని చూచి భయపడతారు. |
5
|
యెహోవా ఎదుట పర్వతాలు మైనంలా కరగి పోతాయి. భూలోక ప్రభువు ఎదుట అవి కరిగి పోతాయి. |
6
|
ఆకాశములారా, ఆయన మంచితనం గూర్చి చెప్పండి. ప్రతి మనిషీ దేవును మహిమను చూచును గాక! |
7
|
మనుష్యులు వారి విగ్రహాలను పూజిస్తారు. వారు వారి “దేవుళ్లను” గూర్చి అతిశయిస్తారు. కానీ ఆ ప్రజలు యిబ్బంది పడుతారు. వారి “దేవుళ్లు” యెహోవాకు సాగిలపడి ఆయనను ఆరాధిస్తారు. |
8
|
సీయోనూ, విని సంతోషించుము! యూదా పట్టణములారా, సంతోషించండి! ఎందుకంటే యెహోవా జ్ఞానముగల నిర్ణయాలు చేస్తాడు. |
9
|
సర్వోన్నతుడవైన యెహోవా, నిజంగా నీవే భూమిని పాలించేవాడవు. ఇతర “దేవుళ్ల” కంటే నీవు చాలా మంచివాడవు. |
10
|
యెహోవాను ప్రేమించే ప్రజలు దుర్మార్గాన్ని ద్వేషిస్తారు. కనుక దేవుడు తన అనుచరులను రక్షిస్తాడు. దేవుడు దుర్మార్గులనుండి తన ఆనుచరులను రక్షిస్తాడు. |
11
|
మంచి మనుష్యుల మీద వెలుగు, సంతోషం ప్రకాశిస్తాయి. |
12
|
మంచి మనుష్యులారా యెహోవాయందు ఆనందించండి. ఆయన పవిత్ర నామాన్ని ఘనపరచండి. |
Psalms 97:1 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...