Indian Language Bible Word Collections
Psalms 89:10
Psalms Chapters
Psalms 89 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Psalms Chapters
Psalms 89 Verses
1
యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను. ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2
యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను. నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3
దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను. నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4
‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను. నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’ ”
5
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి. పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు. “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7
యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు ఆ దేవ దూతులు భయపడి యెహోవాను గౌరవిస్తారు. వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగల వారు ఒక్కరూ లేరు. మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు. దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10
దేవా, నీవు రహబును [*రహబు సముద్ర రాక్షసి. అది దేవునికి శత్రువు అని కొన్ని పురాతన గాథలు చెబతాయి.] ఓడించావు. నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11
దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వంనీదే. ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12
ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు. తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13
దేవా, నీకు శక్తి ఉంది! నీ శక్తి గొప్పది! విజయం నీదే!
14
సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది. ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15
దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు. వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16
నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది. వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17
నీవే వారి అద్భుత శక్తివి, వారి శక్తి, నీ నుండే లభిస్తుంది.
18
యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు. ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19
కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు. నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను. ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20
నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను. నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21
నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను. మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22
ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు. దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23
అతని శత్రువులను నేను అంతం చేసాను. ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24
ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను. నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25
ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను. నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26
‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’ అని అతడు నాతో చెబతాడు.
27
మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను. భూ రాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28
ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది. అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29
అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30
అతని సంతతి వారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే, నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31
ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞాలను ఉల్లంఘించి, నా ఆదేశాలను పాటించకపోతే
32
అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33
కానీ వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను. నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34
దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను. మా ఒడంబడికను నేను మార్చను.
35
నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్ధానం చేసాను. మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36
దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది. సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37
చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది. ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
38
కానీ దేవా, ఏర్పరచబడిన నీ రాజు [†ఏర్పరచబడిన నీ రాజు అక్షరార్థంగా అభిషేకించబడిన వ్యక్తి.] మీద నీకు కోపం వచ్చింది. నీవు అతన్ని ఒంటరి వానిగా విడిచి పెట్టావు.
39
నీ ఒడంబడికను నీవు తిరస్కరించావు. రాజు కిరీటాన్ని నీవు దుమ్ములో పారవేసావు.
40
రాజు పట్టణపు గోడలను నీవు కూలగొట్టావు. అతని కోటలన్నింటినీ నీవు నాశనం చేశావు.
41
రాజు పొరుగువారు అతన్ని చూచి నవ్వుతారు. దారినపోయే మనుష్యులు అతని నుండి వస్తువులు దొంగిలిస్తారు.
42
రాజు శత్రువులందరికీ నీవు సంతోషం కలిగించావు. అతని శత్రువులను యుద్ధంలో నీవు గెలువనిచ్చావు.
43
దేవా, వారిని వారు కాపాడుకొనేందుకు నీవు వారికి సహాయం చేశావు. నీ రాజు యుద్ధంలో గెలిచేందుకు నీవు అతనికి సహాయం చేయలేదు.
44
అతని సింహాసనాన్ని నీవు నేలకు విసరివేశావు.
45
అతని ఆయుష్షు నీవు తగ్గించి వేశావు. నీవు అతన్ని అవమానించావు.
46
యెహోవా, నీవు శాశ్వతంగా మా నుండి మరుగైయుంటావా? నీ కోపం అగ్నిలా ఎప్పటికీ మండుతూ ఉంటుందా? ఎంత కాలం యిలా సాగుతుంది?
47
నా ఆయుష్షు ఎంత తక్కువో జ్ఞాపకం చేసికొనుము. అల్పకాలం జీవించి, తర్వాత మరణించేందుకు నీవు మమ్మల్ని సృష్టించావు.
48
ఏ మనిషీ జీవించి, ఎన్నటికీ చావకుండా ఉండలేడు. ఏ మనిషీ సమాధిని తప్పించుకోలేడు.
49
దేవా, గతంలో నీవు చూపించిన ప్రేమ ఎక్కడ? దావీదు కుటుంబానికి నీవు నమ్మకంగా ఉంటావని అతనికి నీవు వాగ్దానం చేశావు.
50
(50-51) ప్రభూ, ప్రజలు నీ సేవకులను ఎలా అవమానించారో దయచేసి జ్ఞాపకం చేసుకొనుము. యెహోవా, నీ శత్రువులనుండి ఆ అవమానాలన్నింటినీ నేను వినాల్సి వచ్చింది. ఏర్పరచబడిన నీ రాజును ఆ మనుష్యులు అవమానించారు.
52
యెహోవాను శాశ్వతంగా స్తుతించండి. ఆమేన్, ఆమేన్! [‡ఆమేన్ నిజంగానే అని అర్థం. అవతలి వారు చెప్పినట్టే ఒప్పుకొంటున్నాను. అని తెలియజేయుటకు ఉపయోగించబడిన పదం.]