1
|
యెహోవా దేవా, నీవు నా రక్షకుడవు. రాత్రింబగళ్లు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. |
2
|
దయచేసి నా ప్రార్థనలను గమనించుము. కరుణకోసం నేను చేస్తున్న ప్రార్థనలు ఆలకించుము. |
3
|
నా కష్టాలు అన్నింటితో నేను విసిగిపోయాను. మరణించుటకు నేను సిద్ధంగా ఉన్నాను. |
4
|
జీవించుటకు బహు బలహీనుడివలె చనిపోయిన మనిషివలె ప్రజలు నాతో వ్యవహరిస్తున్నారు. |
5
|
మరణించుటకు నేను ఒంటరిగా విడువబడ్డాను. నేను సమాధిలో ఉన్న శవంలా ఉన్నాను. నీనుండీ నీ జాగ్రత్తనుండి నీవు వేరుచేసిన మృతులలో ఒకనివలె నేనున్నాను. మనుష్యులు వారిని పూర్తిగా మరచిపోతారు. |
6
|
యెహోవా, నీవు నన్ను భూమి కింద సమాధిలో ఉంచావు. నీవు నన్ను ఆ చీకటి స్థలంలో ఉంచావు. |
7
|
నీవు నా మీద కోపగించావు. నీవు నన్ను శిక్షించావు. |
8
|
నా స్నేహితులు నన్ను విడిచిపెట్టేశారు. అంటరాని మనిషిలా వారంతా నన్ను తప్పించి వేస్తారు. నేను యింటిలో బంధించబడ్డాను, నేను బయటకు వెళ్లలేను. |
9
|
నా బాధ అంతటినీ గూర్చి ఏడ్చి నా కళ్లు నొప్పిగా ఉన్నాయి. యెహోవా, నేను ఎడతెగకుండా నిన్ను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనలో నేను నీకు నా చేతులు జోడిస్తున్నాను. |
10
|
యెహోవా, చనిపోయిన వారి కోసం నీవు అద్భుతాలు చేస్తావా? లేదు! దురాత్మలు లేచి నిన్ను స్తుతిస్తాయా? లేదు! |
11
|
చనిపోయిన వాళ్లు వారి సమాధుల్లో నీ ప్రేమను గూర్చి మాట్లాడలేరు. చనిపోయిన వారు మృతులలోకంలో ఉండి నీ నమ్మకత్వం గూర్చి మాట్లాడలేరు. |
12
|
చీకటిలో పడివున్న మృతులు నీవు చేసే అద్భుత కార్యాలు చూడలేరు. మరచిపోయిన వారి లోకంలో ఉన్న మృతులు నీ మంచితనం గూర్చి మాట్లాడలేరు. |
13
|
యెహోవా, నాకు సహాయం చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను. ప్రతి వేకువ ఝామునా నేను నిన్ను ప్రార్థిస్తాను. |
14
|
యోహోవా, నీవెందుకు నన్ను విడిచిపెట్టేశావు? నానుండి నీ ముఖాన్ని ఎందుకు దాచుకొంటున్నావు? |
15
|
నేను బాలుడిగా ఉన్నప్పటినుండి నేను బలహీనుడను, రోగిని. నేను నీ కోపాన్ని అనుభవించాను, నేను నిస్సహాయుడను. |
16
|
యెహోవా, నీవు నా మీద చాలా కోపగించావు. శిక్ష నన్ను చంపేస్తుంది. |
17
|
నాకు నొప్పులు, బాధలు ఎల్లప్పుడూ ఉన్నాయి. నా నొప్పులు, బాధల్లో నేను మునిగి పోతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. |
18
|
మరియు యెహోవా, నా స్నేహితులు, నా ప్రియులు అంతా నన్ను విడిచి పెట్టివేసేటట్టుగా నీవు చేశావు. చీకటి మాత్రమే నాకు మిగిలింది. |
Psalms 88:2 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...