1
|
దేవా, మౌనంగా ఉండవద్దు! నీ చెవులు మూసికోవద్దు! దేవా, దయచేసి ఊరుకోవద్దు. |
2
|
దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు. నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు. |
3
|
నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు. నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు. |
4
|
“ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము. అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబతున్నారు. |
5
|
దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతోచేసిన ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు. |
6
|
[This verse may not be a part of this translation] |
7
|
[This verse may not be a part of this translation] |
8
|
అష్షూరు సైన్నం లోతు వంశస్థులతో చేరి, వారంతా నిజంగా బలముగలవారయ్యారు. |
9
|
దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరానును, యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము. |
10
|
ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు. వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి. |
11
|
దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము. జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము. |
12
|
దేవా, మేము నీ దేశం విడిచేందుకు ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు. |
13
|
గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె ఆ ప్రజలను చేయుము. గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము. |
14
|
అగ్ని అడవిని నాశనం చేసినట్టు కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము. |
15
|
దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము. సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము. |
16
|
దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము. అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు. |
17
|
దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గు పడునట్లు చేయుము. వారిని అవమానించి, నాశనం చేయుము. |
18
|
అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసు కొంటారు. నీ పేరు యోహోవా అని వారు తెలుసుకొంటారు. నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు అని వారు తెలుసుకొంటారు. |
Psalms 83:18 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...