Indian Language Bible Word Collections
Psalms 8
Psalms Chapters
Psalms 8 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Psalms Chapters
Psalms 8 Verses
1
|
యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది. |
2
|
పరలోకమంతా నీ పిల్లల కీర్తి చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది. నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు. |
3
|
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను. నీవు సృష్టించిన సూర్య చంద్ర, నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను. |
4
|
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు? నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు? మానవ మాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం? నీవు వానిని గమనించటం ఎందుకు? |
5
|
అయితే మానవుడు నీకు ముఖ్యం. వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు. మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు. |
6
|
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికార మిచ్చియున్నావు. ప్రతిదానిని నీవు వాని అధీనంలో వుంచావు. |
7
|
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు. |
8
|
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే చేపల మీద వారు ఏలుబడి చేస్తారు. |
9
|
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది! |