1
|
దేవా మమ్ములను కనికరించి, మమ్ములను ఆశీర్వదించుము. దయచేసి మమ్ములను స్వీకరించుము. |
2
|
దేవా, భూమి మీద ప్రతి మనిషినీ నిన్ను గూర్చి తెలుసుకోనిమ్ము. నీవు మనుష్యులను ఎలా రక్షిస్తావో ప్రతి దేశం నేర్చుకోనిమ్ము. |
3
|
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరుగాక ! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరుగాక! |
4
|
దేశాలన్నీ ఆనందించి, సంతోషించుగాక! ఎందుకంటే నీవు మనుష్యులకు న్యాయంగా తీర్పు తీరుస్తావు మరియు ప్రతి దేశాన్నీ నీవు పాలిస్తావు. |
5
|
దేవా, ప్రజలు నిన్ను స్తుతించెదరు గాక! మనుష్యులంతా నిన్ను స్తుతించెదరు గాక! |
6
|
దేవా, మా దేవా, మమ్మల్ని దీవించుము. మా భూమి మాకు గొప్ప పంట ఇచ్చేటట్టుగా చేయుము. |
7
|
దేవుడు మమ్మల్ని దీవించుగాక. భూమిమీద వున్న ప్రతి ఒక్కరూ దేవునికి భయపడి, ఆయనను గౌరవించెదరు గాక. |
Psalms 67:6 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...