1
|
దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచివుంటాను. |
2
|
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తున్నాడు. పర్వతం మీద ఎత్తయిన నా క్షేమస్థానం దేవుడే. మహా సైన్యాలు కూడా నన్ను ఓడించలేవు. |
3
|
ఇంకెంత కాలం నా మీద దాడి చేస్తూ ఉంటావు. నేను ఒరిగిపోయిన గోడలా ఉన్నాను. పడిపోతున్న కంచెలా ఉన్నాను. |
4
|
ఆ మనుష్యులు నన్ను నాశనం చేయటానికి పథకాలు వేస్తున్నారు. వారు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. బహిరంగంగా వారు నన్ను గూర్చి మంచి మాటలు చెబతారు, కాని రహస్యంగా వారు నన్ను శపిస్తారు. |
5
|
దేవుడు నన్ను రక్షించాలని నేను సహనంతో వేచి ఉన్నాను. దేవుడు ఒక్కడే నా నిరీక్షణ. |
6
|
దేవుడు నా కోట. దేవుడు నన్ను రక్షిస్తాడు. పర్వతం మీద ఎత్తయిన నా క్షేమ స్థానం దేవుడే. |
7
|
నా మహిమా విజయం దేవుని నుండి వస్తుంది. ఆయన నా బలమైన కోట. దేవుడు నా క్షేమ స్థానం |
8
|
ప్రజలారా, ఎల్లప్పుడూ దేవునియందు నమ్మిక ఉంచండి. మీ సమస్యలు దేవునితో చెప్పండి. దేవుడే మన క్షేమ స్థానం. |
9
|
మనుష్యులు నిజంగా సహాయం చేయలేరు. నిజంగా సహాయం కోసం నీవు వారిని నమ్ముకోలేవు. వారు గాలిబడగల్లా వట్టి ఊపిరియైయున్నారు. |
10
|
బలవంతంగా విషయాలను చేజిక్కించు కొనుటకు నీ శక్తిని నమ్ముకోవద్దు. దొంగిలించడం ద్వారా నీకు ఏదైనా లాభం కలుగుతుందని తలచవద్దు. నీవు ధనికుడవైతే నీ సహాయం కోసం ధనాన్ని నమ్ముకొన వద్దు. |
11
|
నీవు నిజంగా ఆధారపడదగినది ఒకటి ఉన్నదని దేవుడు చెబతున్నాడు, “బలము దేవుని నుండే వస్తుంది.” |
12
|
నా ప్రభువా, నీ ప్రేమ నిజమైనది. ఒకడు చేసిన వాటిని బట్టి నీవతనికి బహుమానం ఇస్తావు లేదా శిక్షిస్తావు. |
Psalms 62:7 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...