1
|
సర్వజనులారా చప్పట్లు కొట్టండి. సంతోషంగా దేవునికి కేకలు వేయండి. |
2
|
మహోన్నతుడగు యెహోవా భీకరుడు. భూలోకమంతటికీ ఆయన రాజు. |
3
|
ఆయన ప్రజలను మనకు లోపరిచాడు. ఆ రాజ్యాలను మన పాదాల క్రింద ఉంచాడు. |
4
|
దేవుడు మన కోసం మన దేశాన్ని కోరుకున్నాడు. యాకోబు కోసం అద్భుత దేశాన్ని ఆయన కోరుకున్నాడు. యాకోబు ఆయన ప్రేమకు పాత్రుడు. |
5
|
బూర మ్రోగగానే యుద్ధనాదం వినబడగానే యెహోవా దేవుడు లేచాడు. |
6
|
దేవునికి స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. మన రాజుకు స్తుతులు పాడండి. స్తుతులు పాడండి. |
7
|
దేవుడు సర్వలోకానికి రాజు. స్తుతిగీతాలు పాడండి. |
8
|
దేవుడు తన పరశుద్ద సింహాసనం మీద కూర్చున్నాడు. దేవుడు సకల రాజ్యాలనూ పాలిస్తు న్నాడు. |
9
|
రాజ్యాల నాయకులు దేవుని ప్రజలతో సమావేశ మయ్యారు. దేవుని ప్రజలు అబ్రాహాము వంశస్థులు. వారి జనాంగమును కాపాడును. నాయకులందరూ దేవునికి చెందినవారు. దేవుడు మహోన్నతుడు. |
Psalms 47:7 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...