“నేను జాగ్రత్తగా నడచుకొంటాను. నా నాలుకతో నన్ను పాపం చేయనివ్వను” అని నేను అన్నాను. నేను దుర్మార్గులకు సమీపంగా ఉన్నప్పుడు నేను నా నోరు మూసుకొంటాను. [*నా నోరు మూసుకొంటాను అక్షరాల నా నోటికి కళ్ళెం పెట్టుకుంటాను.]
యెహోవా నీవు నాకు కొద్దికాలం జీవితం మాత్రమే ఇచ్చావు. నా జీవితం నీ ఎదుట శూన్యం. ప్రతి మనిషి యొక్క జీవితం ఒక మేఘంలాంటిది మాత్రమే. ఏ మనిషి శాశ్వతంగా జీవించడు.
మేము జీవించే జీవితం అద్దంలోని ప్రతిబంబిం వంటిది. మా ప్రయాసలన్నియు వ్యర్థము. మేము సామగ్రి సమకూర్చుకొంటూనే ఉంటాము. కానీ ఆ సామగ్రి ఎవరికి దొరుకుతుందో మాకు తెలియదు.
యెహోవా, తప్పు చేసిన వారిని నీవు శిక్షించుము. ప్రజలు జీవించాల్సిన సరైన విధానాన్ని నీవు అలా నేర్పిస్తావు. వారికి ప్రియమైన దాన్ని చిమ్మటవలె నీవు నాశనం చేస్తావు. మా జీవితాలు అంతలోనే మాయమయ్యే మేఘంలా ఉన్నాయి.
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. నేను నీకు మొరపెట్టే మాటలు వినుము. నా కన్నీళ్లు తెలియనట్లు ఉండవద్దు. నేను దాటిపోతున్న ఒక అతిథిని. నా పూర్వీకులందరిలాగే నేను కూడా ఒక బాటసారిని.