1
|
నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక. యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక . |
2
|
దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక. సీయోను నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక! |
3
|
నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక. నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక. |
4
|
నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక. నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక. |
5
|
దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదముగాక. దేవుని నామమునకు. స్తొత్రము క లుగును గాక. నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక. |
6
|
ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయర చేస్తాడని నాకు తెలుసు. దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు. ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయెగించాడు. |
7
|
కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు మనుష్యులు వారి గుర్రాలను నమ్ముకొంటారు. కానీ మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము. |
8
|
ఆ ఇతర మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు. కానీ మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము! |
9
|
దేవుడు రాజును రక్షించును గాక! మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము. |
Psalms 20:6 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...