“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం. మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.
(5-6) దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు: “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను. అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.” మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.
మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి [*దేవుని … చూపించండి అక్షరార్థం కుమారునికి ముద్దు పెట్టుకోండి.] మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు. యెహోవాయందు విశ్వసం ఉంచేవారు సంతోషిస్తారు. కానీ ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.