1
|
“యెహోవా, నా బలమా నేను నిన్ను ప్రేమిస్తున్నాను!” అతడీలాగన్నాడు.. |
2
|
యెహోవా నా దండ, నా కోట, నా రక్షకుడు. నా దేవుడే నా అండ. నేను ఆశ్రయంకోసం ఆయన యొద్దకు పరుగెత్తుతాను. దేవుడు నా డాలు, ఆయనే శక్తి నన్ను రక్షిస్తాడు. ఎత్తైన కొండలలో యెహోవా నా దాగుకొను స్థలము. |
3
|
యెహోవాకు నేను మొరపెడ్తాను. యెహోవా స్తుతించబడుటకు అర్హుడు మరియు నా శత్రువుల బారినుండి నేను రక్షించబడుతాను. |
4
|
[This verse may not be a part of this translation] |
5
|
[This verse may not be a part of this translation] |
6
|
చిక్కులో పడి, నేను సహాయం కోసం యెహోవాకు మొరపెట్టాను. నేను నా దేవుని ప్రార్థించాను. దేవుడు తన పవిత్ర స్థలం నుండి నా ప్రార్థన విన్నాడు. సహాయంకోసం నేను చేసిన ప్రార్థనలు ఆయన విన్నాడు. |
7
|
యెహోవా నాకు సహాయం చేయటానికి వస్తున్నాడు. భూమి కంపించి వణికినది. పర్వతాలు కంపించాయి. ఎందుకంటే ప్రభువు కోపించాడు. |
8
|
ఆయన ముక్కుల్లో నుండి పొగ లేచింది. యెహోవా నోటి నుండి మండుతున్న జ్వాలలు వచ్చాయి. నిప్పు కణాలు ఆయన నుండి రేగాయి. |
9
|
యెహోవా గగనం చీల్చుకొని దిగి వచ్చాడు. ఆయన పాదాల క్రింద నల్లటి మేఘాలు ఉన్నాయి. |
10
|
ఎగిరే కెరూబులు మీద ఆయన స్వారీ చేశాడు. ఆయన గాలుల మీద పై కెగిరాడు. |
11
|
యెహోవాను ఆవరించిన మహా దట్టమైన మైఘంలో ఆయన మరుగైయున్నాడు. దట్టమైన ఉరుము మేఘంలో ఆయన మరుగై యున్నాడు. |
12
|
అప్పుడు, దేవుని ప్రకాశమానమైన వెలుగు మేఘాలనుండి బయలు వెడలినది. అంతట వడగండ్లు, మెరుపులు వచ్చినవి. |
13
|
యెహోవా యొక్క స్వరం ఆకాశంలో గట్టిగా ఉరిమింది. సర్వోన్నతుడైన దేవుడు తన స్వరాన్ని వినిపించాడు. వడగండ్లు, మెరుపులు కలిగాయి. |
14
|
యెహోవా తన బాణాలు వేయగా శత్రువు చెదరి పోయాడు, అనేకమైన ఆయన మెరుపు పిడుగులు వారిని ఓడించాయి. |
15
|
యెహోవా, నీవు బలంగా మాట్లాడావు, మరియు నీవు నీ నోటినుండి బలమైన గాలిని ఊదావు. నీళ్లు వెనక్కు నెట్టివేయబడ్డాయి, సముద్రపు అడుగును మేము చూడగలిగాము. భూమి పునాదులను మేము చూడగలిగాము. |
16
|
పై నుండి యెహోవా కిందికి అందుకొని నన్ను రక్షించాడు. నా కష్టాల్లోనుండి ఆయననన్ను బయటకు లాగాడు. |
17
|
నా శత్రువులు నాకంటె బలవంతులు. ఆ మనుష్యులు నన్ను ద్వేషించారు. పైగా వారు నాకంటె బలం కలవారు. అయినను దేవుడు నన్ను రక్షించాడు. |
18
|
నా కష్టకాలంలో ఆ మనుష్యులు నా మీద దాడి చేశారు. కానీ యెహోవా నన్ను బలపర్చాడు. |
19
|
యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు. కనుక ఆయన నన్ను కాపాడాడు. ఆయన నన్నుక్షేమ స్థలానికి తీసికొని వెళ్లాడు. |
20
|
నేను నిర్దోషిని కనుక యెహోవా నాకు ప్రతి ఫలమిచ్చాడు. నేను ఏ తప్పు చేయలేదు. కనుక ఆయన నాకు తిరిగి చెల్లించాడు. |
21
|
నేను యెహోవాను అనుసరించాను. నా దేవునికి విరుద్ధంగా నేను చెడు కార్యాలు చెయలేదు. |
22
|
యెహోవా చట్టాలు, అన్నింటినీ నేను జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆయన ఆదేశాలను నేను త్రోసివేయ లేదు. |
23
|
ఆయన ఎదుట నేను నిర్దోషిగా ఉన్నాను. నన్ను నేను పాపమునుండి దూరం చేసుకొన్నాను. |
24
|
నేను సరైనదాన్ని చేసినందుకు యెహోవా నాకు ప్రతిఫలమిచ్చాడు. నా క్రియలు దేవుని ఎదుట నిర్దోషమైనవి. అందుకే ఆయన నాకు మంచి చేస్తాడు. |
25
|
యెహోవా, నమ్మదగిన మనుష్యులకు నీవు నమ్మ దగినవాడవు. మరియు మంచి మనుష్యులకు నీవు మంచివాడవు. |
26
|
యెహోవా, మంచివాళ్లకు, పవిత్రమైన వాళ్లకు నీవు మంచివాడవు, పవిత్రమైన వాడవు. కానీ, గర్విష్ఠులను, టక్కరి వాళ్లను నీవు అణచివేస్తావు. |
27
|
యెహోవా, నీవు పేదలకు సహాయం చేస్తావు. కానీ గర్విష్టులను నీవు ప్రాముఖ్యత లేని వారిగా చేస్తావు. |
28
|
యెహోవా, నీవు నా దీపం వెలిగిస్తావు. నా దేవా, నా చీకటిని నీవు వెలుగుగా చేస్తావు. |
29
|
యెహోవా, నీ సహాయంతో నేను సైన్య దళాలతో పరుగెత్తగలను. నీ సహాయంతో, నేను శత్రువు గోడలు ఎక్కగలను. |
30
|
దేవుని మార్గాలు పవిత్రం, మంచివి. యెహోవా మాటలు సత్యం. ఆయనయందు విశ్వాసం ఉంచేవాళ్లను ఆయన భద్రంగా ఉంచుతాడు. |
31
|
యెహోవా తప్ప నిజమైన దేవుడు ఒక్కడూ లేడు. మన దేవుడు తప్ప మరో బండ లేదు. |
32
|
దేవుడు నాకు బలం ఇస్తాడు. ఆయన నా జీవితాన్ని పావనం చేస్తాడు. |
33
|
దేవుడు నా కాళ్లను లేడి కాళ్లవలె వేగంగా ఉంచుతాడు. ఆయన నన్ను స్థిరంగా ఉంచుతాడు. ఎత్తయిన బండలమీద పడకుండా ఆయన నన్ను కాపాడుతాడు. |
34
|
యుద్ధంలో ఎలా పోరాడాలో దేవుడు నాకు నేర్పిస్తాడు. ఇత్తడి విల్లును ఎక్కు పెట్టుటకు నా చేతులకు ఆయన బలాన్ని ఇస్తాడు. |
35
|
దేవా, నీ డాలుతో నన్ను కాపాడితివి. నీ కుడిచేతితో నన్ను బలపరుచుము. నీ సహాయం నన్ను గొప్పవానిగా చేసినది. |
36
|
నా అడుగులకు నీవు విశాలమైన మార్గాన్నిచ్చావు. నా పాదాలు జారిపోలేదు. |
37
|
నేను నా శత్రువులను తరిమి, వారిని పట్టుకొన్నాను. వారు నాశనం అయ్యేవరకు నేను తిరిగిరాలేదు. |
38
|
నా శత్రువులను నేను ఓడిస్తాను. వారిలో ఒక్కరుకూడా తిరిగి లేవరు. నా శత్రువులు అందరూ నా పాదాల దగ్గర పడ్డారు. |
39
|
దేవా, యుద్ధంలో నాకు బలం ప్రసాదించుము. నా శత్రువులంతా నా యెదుట పడిపోయేట్టు చేయుము. |
40
|
యెహోవా, నా శత్రువులను వెనుదిరిగేటట్లు చేశావు. నీ సహాయంవల్లనే నన్ను ద్వేషించే వారిని నేను నాశనం చేస్తాను. |
41
|
నా శత్రువులు సహాయం కోసం అడిగారు, కానీ ఎవ్వరూ వారికి సహాయం చేసేందకు రాలేదు. వారు యెహోవాకు కూడా మొరపెట్టారు. కాని ఆయన వారికి జవాబు ఇవ్వలేదు. |
42
|
నా శత్రువులను నేను ధూళిగా నలగగొట్టాను. వారు గాలికి చెదరిపోయే దుమ్ములా ఉన్నారు. నేను వాళ్లను వీ ధుల బురదగా పారవేసాను. |
43
|
నాకు వ్యతిరేకంగా పోరాడే మనుష్యుల నుండి నన్ను కాపాడావు. ఆ రాజ్యాలకు నన్ను నాయకునిగా చేయుము. నేను ఎరుగని ప్రజలు నాకు సేవ చేస్తారు. |
44
|
ఆ మనుష్యులు నా గురించి విన్నప్పుడు విధేయులయ్యారు. ఇతర రాజ్యాల ప్రజలు నేనంటే భయపడ్డారు. |
45
|
ఆ విదేశీ ప్రజలు నేనంటే భయపడ్డారు, కనుక వారు భయంతో వణుకుతూ సాష్టాంగపడ్డారు. వారు దాక్కొనే తమ స్థలాలనుండి బయటకు వచ్చారు. |
46
|
యెహోవా సజీవంగా ఉన్నాడు. నా ఆశ్రయ దుర్గమైన వానిని నేను స్తుతిస్తాను. నా దేవుడు నన్ను రక్షిస్తాడు. అందుచేత ఆయనను స్తుతులతో పైకెత్తండి. |
47
|
నాకోసం నా శత్రువులను శిక్షించాడు. ఆ ప్రజలను ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేసాడు. |
48
|
యెహోవా, నీవే నా శత్రువుల నుండి నన్ను తప్పించావు. కృ-రులైన వారి నుండి నీవు నన్ను రక్షించావు. నాకు విరుద్ధంగా నిలిచినవారిని ఓడించుటకు నీవు నాకు సహాయం చేశావు. |
49
|
కనుక మనుష్యులందరి యెదుట యెహోవాను నేను స్తుతిస్తాను. నీ నామ కీర్తన గానము చేస్తాను. |
50
|
యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు, ఆయన గొప్ప విజయాలిచ్చాడు. ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు అనగా దావీదుకు, తన సంతానానికీ నిరంతరం ఆయన ఎంతో దయ చూపాడు. |
Psalms 18:30 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...