1
|
యెహోవాను స్తుతించండి! నా ప్రాణమా! యెహోవాను స్తుతించు! |
2
|
నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను. నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను. |
3
|
సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు. మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు. |
4
|
మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడుతారు. అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే. |
5
|
సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు. ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు. |
6
|
భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు. యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు. |
7
|
అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు. ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు. చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు. |
8
|
గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు. కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు. మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు. |
9
|
మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు. విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు. అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు. |
10
|
యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను. యెహోవాను స్తుతించండి! |
Psalms 146:9 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...