1
|
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
2
|
దేవుళ్లకు దేవుణ్ణి స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ నిరంతరం ఉంటుంది. |
3
|
యెహోవా దేవున్ని స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
4
|
ఆశ్చర్యకరమైన అద్భుతాలు చేసే ఆయన్ని మాత్రమే స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లప్పుడు ఉంటుంది. |
5
|
జ్ఞానంచేత ఆకాశాన్ని సృజించిన దేవుణ్ణి స్తుతించండి. ఆయన నిజమైన ప్రేమ ఎల్లకాలం ఉంటుంది. |
6
|
దేవుడు సముద్రం మీద ఆరిన నేలను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
7
|
దేవుడు గొప్ప జ్యోతులను చేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
8
|
దేవుడు పగటిని ఏలుటకు సూర్యుణ్ణి చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
9
|
దేవుడు రాత్రిని ఏలుటకు చంద్రుని, నక్షత్రాలను చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
10
|
దేవుడు ఈజిప్టు మనుష్యులలో మొదటివారిని, జంతువులలోను మొదటివాటిని చంపేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
11
|
దేవుడు ఈజిప్టునుండి ఇశ్రాయేలును విడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
12
|
దేవుడు తన గొప్ప శక్తిని బలాన్ని చూపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
13
|
దేవుడు ఎర్రసముద్రాన్ని రెండు పాయలుగా చేసాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
14
|
దేవుడు తన ఇశ్రాయేలును ఎర్రసముద్రంలో నుండి నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
15
|
దేవుడు ఫరోను, అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
16
|
దేవుడు తన ప్రజలను ఉడారిలో నడిపించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
17
|
దేవుడ శక్తిగల రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
18
|
దేవుడు బలమైన రాజులను ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
19
|
దేవుడు ఆమోరీయుల రాజైన సీహోనును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
20
|
దేవుడు భాషాను రాజైన ఓగును ఓడించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
21
|
దేవుడు వారి దేశాన్ని ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
22
|
దేవుడు ఆ దేశాన్ని ఒక కానుకగా ఇశ్రాయేలీయులకు యిచ్చాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
23
|
దేవుడు, మనం ఓడించబడినప్పుడు మనలను జ్ఞాపకం చేసికొన్నాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
24
|
దేవుడు మన శత్రువుల నుండి మనలను రక్షించాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
25
|
దేవుడు ప్రతి ప్రాణికి ఆహారం యిస్తాడు. ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
26
|
పరలోకపు దేవుని స్తుతించండి! ఆయన నిజమైన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
Psalms 136:19 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...