1
|
యెహోవాను స్తుతించండి. యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి. |
2
|
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి! |
3
|
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి. యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి. |
4
|
యెహోవా యాకోబును కోరుతున్నాడు. యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు. |
5
|
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు. మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు! |
6
|
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో, అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలను కొంటే అది చేస్తాడు. |
7
|
భూమికి ప్తెగా మేఘాలను దెవుడు చేస్తాడు . మెరుపులను , వర్షాన్ని దెవుడు చేస్తాడు. దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు . |
8
|
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్టులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు. |
9
|
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు. ఫరోకు, అవి అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు. |
10
|
దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు. బలమైన రాజులను దేవుడు చంపేసాడు. |
11
|
అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు. బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు. కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు. |
12
|
వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు. |
13
|
యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది. యెహోవా, ప్రజలు నిన్ను జనాంగాల్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు. |
14
|
యెహోవా జనాంగాల్ని శిక్షించాడు. కాని తన సేవకుల యెడల దయ చూపించాడు. |
15
|
ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే. వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే. |
16
|
ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కానీ అవి మాట్లాడలేవు. కళ్లు వున్నాయి కానీ అవి చూడలేవు. |
17
|
ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కానీ అవి వినలేవు. ముక్కులు ఉన్నాయి కానీ అవి వాసన చూడలేవు. |
18
|
మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు. ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు. |
19
|
ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు! అహరోను వంశమా, యెహోవాను స్తుతించు. |
20
|
లేవీ వంశమా, యెహోవాను స్తుతించు! యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి. |
21
|
సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి, యెహోవా స్తుతించబడును గాక! యెహోవాను స్తుతించండి! |
Psalms 135:7 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...