1
|
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మనకు ఏమి జరిగి ఉండేదో? ఇశ్రాయేలూ, నాకు జవాబు చెప్పుము. |
2
|
గత కాలంలో యెహోవాయే మన పక్షంగా ఉండకపోతే మాకు ఏమి జరిగి ఉండేదో? ప్రజలు మనమీద దాడి చేసినప్పుడు ఏమి జరిగి ఉండేదో ? |
3
|
అప్పుడు మన శత్రువులకు మన మీద కోపం వచ్చినప్పుడల్లా వాళ్లు మనల్ని సజీవంగా మింగేసిఉండేవాళ్లు. |
4
|
అప్పుడు మన శత్రుసైన్యాలు మనల్ని కొట్టుకుపోయే ప్రవాహంలా, మనల్ని ముంచివేసే నదిలా ఉండేవి. |
5
|
అప్పుడు ఆ గర్విష్ఠులు నోటి వరకూ పొంగుతూ మనల్ని ముంచి వేసే నీళ్లలా పొంగుతూ ఉండేవాళ్లు. |
6
|
యెహోవాను స్తుతించండి. మన శత్రువులు మనల్ని పట్టి చంపకుండునట్లు యెహోవా చేశాడు. |
7
|
మనం వలలో పట్టబడి తర్వాత తప్పించుకొన్న పక్షిలా ఉన్నాము. వల తెగిపోయింది. మనం తప్పించుకొన్నాము. |
8
|
మనకు సహాయం యోహోవా దగ్గర నుండే వచ్చింది. భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు. కీర్తన 125 యాత్ర కీర్తన. |
Psalms 124:3 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...