1
|
యెహోవా దేవుడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది. |
2
|
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని ఇశ్రాయేలూ, నీవు చెప్పుము. |
3
|
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యాజకులారా, మీరు చెప్పండి. |
4
|
“నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా కొనసాగుతుంది” అని యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరు చెప్పండి. |
5
|
నేను కష్టంలో ఉన్నాను. గనుక సహాయం కోసం నేను యెహోవాకు మొర పెట్టాను, యెహోవా నాకు జవాబిచ్చి, నన్ను విముక్తుని చేశాడు. |
6
|
యెహోవా నాతో ఉన్నాడు గనుక నేను భయ పడను. నన్ను బాధించుటకు మనుష్యులు ఏమీ చేయలేరు. |
7
|
యెహోవా నా సహాయకుడు; నా శత్రువులు ఓడించబడటం నేను చూస్తాను. |
8
|
మనుష్యులను నమ్ముకొనుటకంటే యెహోవాను నమ్ముట మేలు. |
9
|
మీ నాయకులను నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. |
10
|
అనేకమంది శత్రువులు నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తిలో నేను నా శత్రువులను ఓడించాను. |
11
|
శత్రువులు మరల మరల నన్ను చుట్టుముట్టారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను. |
12
|
తేనెటీగల దండులా శత్రువులు నన్ను చుట్టుముట్టారు. కాని వేగంగా కాలిపోతున్న పాదలా వారు అంతం చేయబడ్డారు. యెహోవా శక్తితో నేను వారిని ఓడించాను. |
13
|
నా శత్రువు నా మీద దాడి చేసి దాదాపుగా నన్ను నాశనం చేశాడు. కాని యెహోవా నాకు సహాయం చేశాడు. |
14
|
యెహోవా నా బలం, నా విజయ గీతం! యెహోవా నన్ను రక్షిస్తాడు! |
15
|
మంచివాళ్ల ఇండ్లలో విజయ ఉత్సవం మీరు వినగలరు. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. |
16
|
యెహోవా చేతులు విజయంతో పైకి ఎత్తబడ్డాయి. యెహోవా తన మహా శక్తిని మరల చూపించాడు. |
17
|
నేను జీవిస్తాను! కాని మరణించను. మరియు యెహోవా చేసిన వాటిని గూర్చి నేను చెబతాను. |
18
|
యెహోవా నన్ను శక్షించాడు, కాని ఆయన నన్ను చావనియ్య లేదు. |
19
|
మంచి గుమ్మములారా నా కోసం తెరచుకోండి, నేను లోనికి వచ్చి యెహోవాను ఆరాధిస్తాను. |
20
|
అవి యెహోవా గుమ్మాలు. ఆ గుమ్మాలలో నుండి మంచివాళ్లు మాత్రమే వెళ్లగలరు. |
21
|
యెహోవా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నన్ను రక్షించినందుకు నేను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. |
22
|
ఇల్లు కట్టువారు నిరాకరించిన రాయి మూల రాయి అయ్యింది. |
23
|
ఇలా జరుగునట్లు యెహోవా చేశాడు. అది ఆశ్చర్యంగా ఉందని అనుకొంటున్నాము. |
24
|
ఈ వేళ యెహోవా చేసిన రోజు. ఈ వేళ మనం ఆనందించి సంతోషంగా ఉందాము! |
25
|
ప్రజలు ఇలా చెప్పారు, “యెహోవాను స్తుతించండి. దేవుడు, మమ్మల్ని రక్షించెను. దేవా, దయచేసి మమ్మల్ని వర్ధిల్లజేయుము. |
26
|
యెహోవా నామమున వస్తున్న వానికి స్వాగతం చెప్పండి. “ యాజకులు ఇలా జవాబు ఇచ్చారు, “యెహోవా ఆలయానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాము! |
27
|
యెహోవాయే దేవుడు. ఆయన మనలను అంగీకరిస్తాడు. బలి కోసం గొర్రెపిల్లను కట్టివేయండి. బలిపీఠపు కొమ్ముల వద్దకు గొర్రెపిల్లను మోసి కొని రండి.” |
28
|
యెహోవా, నీవు నా దేవుడవు. నేను నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేను నిన్ను స్తుతిస్తున్నాను. |
29
|
యెహోవా మంచివాడు గనుక ఆయనకు కృతజ్ఞత తెలపండి. నిజమైన ఆయన ప్రేమ శాశ్వతంగా ఉంటుంది. |
Psalms 118:24 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...