1
|
యెహోవా నా ప్రార్థనలు విన్నప్పుడు నాకు ఎంతో సంతోషం. |
2
|
సహాయంకోసం నేను ఆయనకు చేసిన మొర ఆయన విన్నప్పుడు నాకు ఇష్టం. |
3
|
నేను దాదాపు చనిపోయాను. మరణ పాశాలు నన్ను చుట్టుకొన్నాయి. సమాధి నా చుట్టూరా మూసికొంటుంది. నేను భయపడి చింతపడ్డాను. |
4
|
అప్పుడు నేను యెహోవా నామం స్మరించి, “యెహోవా, నన్ను రక్షించుము.” అని అన్నాను. |
5
|
యెహోవా మంచి వాడు, జాలిగల వాడు. యెహోవా దయగలవాడు. |
6
|
నిస్సహాయ ప్రజలను గూర్చి యెహోవా శ్రద్ధతీసుకొంటాడు. నేను సహాయం లేకుండా ఉన్నాను, యెహోవా నన్ను రక్షించాడు. |
7
|
నా ఆత్మా, విశ్రమించు! యెహోవా నిన్ను గూర్చి శ్రద్ధ తీసుకొంటాడు. |
8
|
దేవా, నా ఆత్మను నీవు మరణం నుండి రక్షించావు. నా కన్నీళ్లను నీవు నిలిపివేశావు. నేను పడిపోకుండా నీవు నన్ను పట్టికొన్నావు. |
9
|
సజీవుల దేశంలో నేను యెహోవాను సేవించటం కొనసాగిస్తాను. |
10
|
“నేను నాశనమయ్యాను! “ అని నేను చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొనే ఉన్నాను. |
11
|
నేను భయపడి “మనుష్యులంతా అబద్ధీకులే” అని చెప్పినప్పుడు కూడా నేను నమ్ముకొంటూనే ఉన్నాను. |
12
|
యెహోవాకు నేను ఏమివ్వగలను? నాకు ఉన్నదంతా యెహోవాయే నాకిచ్చాడు. |
13
|
నన్ను రక్షించినందుకు నేను ఆయనకు పానార్పణం యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను. |
14
|
నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి యెదుటికి వెళ్తాను. |
15
|
యెహోవా అనుచరులలో ఎవరి మరణమైనా ఆయనకు ఎంతో దుఃఖకరము. యెహోవా, నేను నీ సేవకుల్లో ఒకడ్ని. |
16
|
నేను నీ సేవకుడను. నీ సేవకులలో ఒకరి కుమారుడ్ని నేను. యెహోవా, నీవే నా మొదటి గురువు. |
17
|
నేను నీకు కృతజ్ఞత అర్పణ యిస్తాను. యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను. |
18
|
నేను వాగ్దానం చేసిన వాటిని నేను యెహోవాకు యిస్తాను. ఇప్పుడు నేను ఆయన ప్రజలందరి ఎదుటికి వెళ్తాను. |
19
|
యెరూషలేములో ఆయన ఆలయానికి నేను వెళ్తాను. యెహోవాను స్తుతించండి! |
Psalms 116:11 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...