1
|
దేవా, నా ప్రార్థనలను పెడచెవిని పెట్టవద్దు. |
2
|
దుర్మార్గులు నన్ను గూర్చి అబద్ధాలు చెబతున్నారు. నిజం కాని సంగతులు ఆ అబద్ధికులు చెబతున్నారు. |
3
|
ప్రజలు నన్ను గూర్చి ద్వేషపూరిత విషయాలు చెబతున్నారు. ఏ కారణం లేకుండానే ప్రజలు నా మీద దాడి చేస్తున్నారు. |
4
|
నేను వారిని ప్రేమిస్తున్నాను. కాని వారు నన్ను ద్వేషిస్తున్నారు. కనుక దేవా, ఇప్పుడు నేను నిన్ను ప్రార్థిస్తున్నాను. |
5
|
ఆ ప్రజలకు నేను మంచి పనులు చేశాను. కాని వారు నాకు చెడ్డపనులు చేస్తున్నారు. నేను వారిని ప్రేమించాను. కాని వారు నన్ను ద్వేషించారు. |
6
|
నా శత్రువు చేసిన చెడు కార్యాల కోసం అతనిని శిక్షించుము. వానిదే తప్పు అని రుజువు చేయగల ఒక మనిషిని చూడుము. |
7
|
నా శత్రువు తప్పు చేసిన దోషి అని న్యాయవాదిని తీర్పు చెప్పనీయుము. నా శత్రువు చెప్పే ప్రతి సంగతీ వానికి చెడుగావుండేటట్టు చేయుము. |
8
|
నా శత్రువును త్వరగా చావనీమ్ము. నా శత్రువు ఉద్యోగం మరొకరు తీసికొనును గాక! |
9
|
నా శత్రువు పిల్లలను అనాథలు కానిమ్ము, వాని భార్య విధవరాలు అగుగాక! |
10
|
వాళ్లు వారి ఇల్లు పోగొట్టుకొని భిక్షగాళ్లు అగుదురు గాక! |
11
|
నా శత్రువు ఎవరికైతే పైకం బాకీ ఉన్నాడో వాళ్లు అతనికి ఉన్నదంతా తీసుకోనివ్వుము. అతని కష్టార్జితం అంతా తెలియని వాళ్లెవరినో తీసికోనివ్వుము. |
12
|
నా శత్రువుకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ. అతని పిల్లలకు ఎవ్వరూ దయ చూపించకూడదని నా ఆశ. |
13
|
నా శత్రువును పూర్తిగా నాశనం చేయుము. తర్వాత తరంవారు అన్నిటిలోనుండి అతని పేరు తొలగించి వేయుదురు గాక. |
14
|
నా శత్రువు తండ్రి పాపాలను, తల్లి పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ. |
15
|
ఆ పాపాలను యెహోవా శాశ్వతంగా జ్ఞాపకం చేసికొంటాడని నా ఆశ. ప్రజలు నా శత్రువును పూర్తిగా మరచిపోయేటట్టు యెహోవా వారిని బలవంతం చేస్తాడని నా ఆశ. |
16
|
ఎందుకంటే, ఆ దుర్మార్గుడు ఎన్నడూ ఏ మంచీ చేయలేదు. అతడు ఎన్నడూ ఎవిరనీ ప్రేమించలేదు. అతడు నిరుపేద, నిస్సహాయ ప్రజలకు జీవితం ఎంతో కష్టకరం చేసాడు. |
17
|
ప్రజలకు సంభవించే చెడు సంగతులు శాపము చూడటానికి ఆ దుర్మార్గులునికి ఎంతో ఇష్టం. కనుక ఆ చెడు సంగతులు అతనికే సభవించనిమ్ము. ప్రజల కోసం మంచి సంగతులు జరగాలని ఆ దుర్మార్గుడు ఎన్నడూ అడుగలేదు. కనుక అతనికి మంచి సంగతులేవీ జరుగనివ్వకుము. |
18
|
శాపాలే వానికి వస్త్రాలుగా ఉండనిమ్ము. దుర్మర్గులు తాగేమదుకు శాపాలే నీళ్లుగా నీళ్లుగా ఉండనిమ్ము శాపాలే వాని శరీరం మీద తైలంగా ఉండనిమ్ము. |
19
|
శాపాలే ఆ దుర్మార్గునికి చుట్టే వస్త్రాలుగా ఉండనిమ్ము. శాపాలే వాని నడుం చుట్టూ దట్టిగా ఉండనిమ్ము. |
20
|
నా శత్రువుకు వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. నన్ను చంపాలని చూస్తున్న మనుష్యులందరికీ వాటన్నిటినీ యెహోవా చేస్తాడని నేను ఆశిస్తున్నాను. |
21
|
యెహోవా, నీవే నాకు ప్రభువు. కనుక నీ నామానికి గౌరవం కలిగే విధంగా నన్ను పరామర్శించు. నీకు ఎంతో గొప్ప ప్రేమ ఉంది. కనుక నన్ను రక్షించుము. |
22
|
నేను కేవలం నిరుపేద, నిస్సహాయ మనిషిని, నేను నిజంగా దుఃఖంగా ఉన్నాను, నా హృదయం పగిలిపోయింది. |
23
|
దినాంతంలో దీర్గ ఛాయలవలె నా జీవితం అయిపోయినట్టు నాకు అనుపిస్తుంది. ఎవరో నలిపివేసిని నల్లిలా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. |
24
|
నేను ఉపవాసం ఉండుటవలన నా మోకాళ్లు బలహీనంగా ఉన్నాయి. నా బరువు తగ్గిపోయి నేను సన్నబడుతున్నాను. |
25
|
చెడ్డవాళ్లు నన్ను అవమానిస్తారు. వారు నన్ను చూచి వారి తలలు ఊపుతారు. |
26
|
దేవా, యెహోవా! నాకు సహాయం చేయుము! నీ నిజమైన ప్రేమను చూపించి నన్ను రక్షించుము. |
27
|
అప్పుడు నీవు నాకు సహాయం చేశావని ఆ ప్రజలు తెలుసుకొంటారు. నాకు కలిగిన సహాయం నీ శక్తివల్ల అని వారు తెలుసుకొంటారు. |
28
|
ఆ దుర్మార్గులు నాకు శాపనార్థాలు పెడతారు; కాని యెహోవా, నీవు నన్ను ఆశీర్వదించగలవు. వారు నా మీద దాడి చేశారు కనుక వారిని ఓడించుము. అప్పుడు నీ సేవకుడనైన నేను సంతోషిస్తాను. |
29
|
నా శత్రువులను ఇబ్బంది పెట్టుము! వారు వారి సిగ్గును వారి అంగీలా ధరించనిమ్ము. |
30
|
యెహోవాకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అనేక మంది ప్రజల ఎదుట నేను ఆయనను స్తుతిస్తాను. |
31
|
ఎందుకంటే, నిస్సహాయ ప్రజల పక్షంగా యెహోవా నిలిచి ఉన్నాడు. వారిని మరణానికి అప్పగించాలని ప్రయత్నించే వారి నుండి దేవుడు వారిని రక్షిస్తాడు. |
Psalms 109:15 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...