1
|
యెహోవాయే రాజు. కనుక రాజ్యాలు భయంతో వణకాలి. కెరూబు దూతలకు పైగా దేవుడు రాజుగా కూర్చున్నాడు. అందుచేత ప్రపంచం భయంతో కదలిపోతుంది. |
2
|
సీయోనులో యెహోవా గొప్పవాడు. ప్రజలందరి మీద ఆయన గొప్ప నాయకుడు. |
3
|
ప్రజలంతా నీ నామాన్ని స్తుతించెదరుగాక. దేవుని నామం భీకరం. దేవుడు పరిశుద్ధుడు. |
4
|
శక్తిగల రాజు న్యాయాన్ని ప్రేమిస్తాడు. దేవా నీతిని నీవు చేశావు. యాకోబుకు (ఇశ్రాయేలు) నీతి న్యాయాలను నీవే జరిగించావు. |
5
|
మన దేవుడైన యెహోవాను స్తుతించండి. ఆయన పవిత్ర పాదపీఠాన్ని ఆరాధించండి. |
6
|
మోషే, అహరోనులు దేవుని యాజకులలో కొందరు, మరియు దేవుని ఆరాధకులలో సమూయేలు ఒకడు. వారు యెహోవాను ప్రార్థించారు. దేవుడు వారికి జవాబు యిచ్చాడు. |
7
|
ఎత్తయిన మేఘం నుండి దేవుడు మాట్లాడాడు. వారు ఆయన ఆదేశాలకు విధేయులయ్యారు. దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు. |
8
|
మా దేవా, యెహోవా, నీవు వారి ప్రార్థనలకు జవాబు ఇచ్చావు. నీవు క్షమించే దేవుడవని, చెడు కార్యాలు చేసినందుకు ప్రజలను నీవు శిక్షిస్తావని వారికి చూపించావు. |
9
|
[This verse may not be a part of this translation] |
Psalms 99:8 Telugu Language Bible Words basic statistical display
COMING SOON ...